twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మామయ్యాను కొట్టడం అభిమానులకు నచ్చలేదు.. అక్కినేని హీరో షాకింగ్ కామెంట్స్

    |

    అక్కినేని ఫ్యామిలిలో ఎవరికి కూడా స్టార్ డమ్ అంత ఈజీగా రాలేదు. ఏఎన్నార్ వేసిన బాటలో వారసుల కెరీర్ కొంచెం క్లిష్టంగానే నడుస్తోంది. ఇకపోతే ప్రయోగాలు చేసిన వారే.. వారికంటూ ఒక క్రేజ్ ని అందుకున్నారు. నాగార్జున నుంచి అఖిల్ వరకు ఇప్పటివరకు ఆ కాంపౌండ్ నుంచి ఐదు మంది హీరోలు పరిచయం అయ్యారు. నాగ్ తరువాత సుమంత్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

    మొదటి దెబ్బ..

    మొదటి దెబ్బ..

    ఏ హీరోకైనా మొదటి సినిమా హిట్టవ్వడం చాలా అవసరం. నేటితరం అక్కినేని హీరోలకు ఆ విషయంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సుమంత్ చేసిన మొదటి సినిమా 'ప్రేమ కథ'. ఆ సినిమా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించడంతో అప్పట్లో ఆ సినిమా రిలీజ్ కి ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. కానీ సినిమా రిలీజ్ తరువాత దారుణంగా దెబ్బ కొట్టింది. ఆ దెబ్బతో సుమంత్ కెరీర్ పై చాలా ఎఫెక్ట్ పడింది.

    ఏ సినిమా చేసినా..

    ఏ సినిమా చేసినా..

    సుమంత్ ఎలాంటి సినిమా చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. మధ్యమధ్యలో కొన్ని సినిమాలు యావరేజ్ హిట్ గా నిలిచాయే తప్ప హీరోకి ఒక బలమైన మార్కెట్ ని సెట్ చేయలేకపోయాయి. తాత అక్కినేని నాగేశ్వరరావు, మామయ్య నాగార్జున.. సుమంత్ కెరీర్ కి ఎలాగైనా ఒక మంచి సక్సెస్ ఇవ్వాలని ప్రయత్నాలు చేశారు. అయితే ఇటీవల సుమంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వారితో చేసిన సినిమాల గురించి చెప్పాడు.

    మామయ్యాను కొట్టడం నచ్చలేదు..

    మామయ్యాను కొట్టడం నచ్చలేదు..

    సుమంత్ నాగార్జునతో కెరీర్ మొదట్లో స్నేహమంటే ఇదేరా అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా నిలవడమే కాకుండా సుమంత్ కెరీర్ పై కుడా ఎఫెక్ట్ చూపించింది. ఆ విషయంపై మాట్లాడుతూ.. "మామయ్యను ఆ సినిమాలో చెంప దెబ్బ కొట్టడం అభిమానులకు నచ్చలేదు. అలాగే ఆ స్క్రిప్ట్ విషయంలో కూడా అనేక తప్పులు జరిగాయి. ఆ సినిమా నేను చేయాల్సింది కాదు" అని సుమంత్ విచారం వ్యక్తం చేశాడు.

    Recommended Video

    Prema Katha Chitram Movie Public Talk || ప్రేమ కథా చిత్రమ్ 2 మూవీ పబ్లిక్ టాక్ || Filmibeat Telugu
    మరో మిస్టేక్..

    మరో మిస్టేక్..

    సుమంత్ కెరీర్ మొదట్లో డౌన్ ఫాల్ కావడానికి తీవ్రంగా ప్రభావం చూపిన సినిమాల్లో పెళ్లి సంబంధం ఒకటి. ఆ సినిమాపై మాట్లాడుతూ.. "ఆ సినిమా కేవలం ఏఎన్నార్ తాతయ్య నటిస్తున్నారని అలాగే కె.రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ చేస్తున్నారనే కారణం చేత ఒప్పుకున్నాను. ఆ సినిమా స్క్రిప్ట్ లో కూడా కొన్ని తప్పులు జరిగాయి. ఈ రెండు సినిమాలు నా కెరీర్ లో బిగ్ మిస్టేక్స్" అని సుమంత్ వివరణ ఇచ్చాడు.

    English summary
    Tollywood hero Sumanth shocking comments about his career in a latest interview. He said that he regrets acting with his uncle akkineni Nagarjuna in their 2001 comedy entertainer, Snehamante Idera
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X