twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంచరణ్ చేస్తాడంటే ఎవరూ నమ్మరు.. మావయ్యతో నాకు గొడవా.. సుమంత్!

    |

    హీరో సుమంత్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సత్యం, మహానంది లాంటి విజయాలు సుమంత్ కెరీర్ లో ఉన్నాయి. నటుడిగా అద్భుతమైన హావభావాలు పలికించగల సత్తా సుమంత్ సొంతం. ఇటీవల్కొన్ని పరాజయాలతో రేసులో కాస్త వెనుకపడ్డారు. కానీ మళ్ళిరావా చిత్రంతో మెప్పించారు. ప్రస్తుతం సుమంత్ సుబ్రహ్మణ్యపురం, ఇదమ్ జగత్ లాంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. సుమంత్ నటించిన సుబ్రహ్మణ్యపురం చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో సుమంత్ పాల్గొంటున్నారు.

    వరుస చిత్రాల్లో బిజీగా

    వరుస చిత్రాల్లో బిజీగా

    సుమంత్ ప్రస్తుతం నటిస్తున్న ప్రతి చిత్రం ఆసక్తిరేకెత్తిస్తోంది. సుబ్రమణ్యపురం చిత్రం ఓ గుడి చుట్టూ అల్లిన సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదమ్ జగత్ కూడా వైరైటీ కాన్సెప్ట్ తో రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా సుమంత్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో ఏఎన్నార్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూడు చిత్రాలపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

    బాలయ్య కనిపించరు

    బాలయ్య కనిపించరు

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఇందులో ఎక్కడా బాలయ్య కనిపించరు. అందరూ రామారావు గారినే చూస్తారు అని సుమంత్ తెలిపాడు. ఈ చిత్రంలో తాతయ్య పాత్రలో నటించడం జీవితంలో వచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తానని సుమంత్ తెలిపాడు. డబ్బింగ్ కూడా పూర్తయింది. తాను నటించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి అని సుమంత్ తెలిపాడు.

    మావయ్యతో గొడవ

    మావయ్యతో గొడవ

    ఇక తన గురించి వచ్చే రూమర్స్ ని తాను పట్టించుకోనని సుమంత్ తెలిపారు. ఇటీవల ఎవరో చెబితే విన్నా.. నాకు, మావయ్యకు గొడవ జరిగినట్లు పుకారు వచ్చిందట.. వినగానే నవ్వేశా అని సుమంత్ తెలిపాడు. నేను పెద్దగా టీవీ, వెబ్ సైట్స్ చూడను. ఈ విధంగా నీకు, నాగార్జునకు మధ్య గొడవ జరిగినట్లు వార్తవచ్చిందని మా వాళ్ళు నాతో అన్నారు. అదొక పెద్ద జోక్ అని సుమంత్ తెలిపాడు.

    రాంచరణ్ చేస్తాడంటే

    రాంచరణ్ చేస్తాడంటే

    ఇక టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ.. రంగస్థలం చిత్రం చూశాక నాకు ఆశ్చర్యం వేసింది. రాంచరణ్ లాంటి స్టార్ హీరో వినికిడి లోపం ఉన్న యువకుడి పాత్రలో నటించడానికి అంగీకరించాడంటే ఎవరూ నమ్మరు. కానీ రాంచరణ్ చేసి చూపించాడని.. అందుకు హ్యాట్సాఫ్ అని సుమంత్ తెలిపాడు. ఇక జూ. ఎన్టీఆర్ ని తాను ముద్దుగా బావ అని పిలుస్తుంటా. నటుడిగా ఎన్టీఆర్ చేయలేనిది అంటూ ఏదీ లేదు అని సుమంత్ తెలిపాడు.

    English summary
    Actor Sumanth About Ram Charan's Chittibabu Role. Subrahmanyapuram will release on Dec 7th
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X