Don't Miss!
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
"మళ్లీ రావా" ని ఇంటికి రమ్మన్న కేసీఆర్: నేరుగా హీరోకే కాల్ చేసిన సీఎం
Recommended Video
టాలీవుడ్ లో ఏదైనా మంచి సినిమా వచ్చిందీ అంటే ఒకప్పుడైతే దాసరి గారు టీమ్ మొత్తాన్నీ ఆయన ఆఫీసుకో, ఇంటికో పిలిచేవారు, సినిమా ప్రమోషన్ కోసం తనవంతు ప్రయత్నమూ చేసేవారు. పొలిటీషియన్లు పెద్దగా సినిమాని పట్టించుకోని కాలం లో అలా చిన్న సినిమా బావుందీ అంటే దాన్ని ప్రోత్సహించే పనులు చేయటంలో కేసీఆర్ ఉంటున్నారు.
మళ్లీ రావా
రీసెంట్ రిలీజ్ మళ్లీ రావా మూవీపై కూడా కేసీఆర్ రియాక్ట్ అయ్యారట. కాకపోతే ఆయన నేరుగా ఈ సినిమా గురించి చెప్పలేదు కానీ.. మళ్లీ రావా ఫీల్ గుడ్ మూవీ అనే విషయం తెలిసిన కేసీఆర్.. ఈ సినిమాను ఓ ప్రింట్ పంపించమని చెప్పారట. నేరుగా హీరో సుమంత్ ఇంటికే ఫోన్ చేశారట తెలంగాణ సీఎం.
ముఖ్యమంత్రి నుంచి ఫోన్
ముఖ్యమంత్రి ఇంటి నుంచి తన సినిమా గురించి ఫోన్ రావడం.. చూడాలని కోరుకుంటున్న సంగతి చెప్పడంతో సంతోషించేశాడట ఈ అక్కినేని హీరో. కేసీఆర్ అడిగిన మేరకు.. వెంటనే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నాడు సుమంత్.
రెండేళ్ల క్రితమే
స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఆయనకిదే తొలి సినిమా. ఈ కథను రెండళ్ల క్రితమే సిద్ధం చేసుకున్నానని, కథ చాలా మంది నిర్మాతలకు నచ్చినా సినిమా నిర్మనించడానికి ఎవరూ ముందుకురాలేదని ‘మళ్లీ రావా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో గౌతమ్ వెల్లడించారు.
ప్రేమకథ
సహజసిద్ధమైన ఈ ప్రేమకథను చాలా సింపుల్‌గా చెప్పారట. సతీష్ ముత్యాల కెమెరా పనితనాన్ని అందరూ మెచ్చుకుంటారని అంటున్నారు. శ్రవణ్ ఇచ్చిన సంగీతం కూడా ఆకట్టుకుంటోంది. చాలా కాలం తరవాత సుమంత్ మళ్లీ ఓ ప్రేమకథలో నటించారు. కొత్త దర్శకుడిపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చారు.
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ
ఇతర సినీ ప్రముఖుల నుంచి కూడా మళ్లీ రావా చిత్రానికి ప్రశంసలే వస్తున్నాయి. ముఖ్యంగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను ఇష్టపడేవారికి పర్ఫెక్ట్ ఛాయిస్ అనే టాక్ వినిపిస్తోంది. కొన్ని ఎపిసోడ్స్ సాగతీత మాదిరిగా అనిపించినా.. క్లైమాక్స్ కి వచ్చేసరికి సినిమాను ముగించిన తీరు బావుంది అన్న టాక్ ఉన్నా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర నిలదొక్కుకునే పరిస్థితిమాత్రం కనిపించటం లేదు.