త్రివిక్రమ్, నేను తిండికోసం కష్టపడ్డాం, కోట్లు ఎగ్గొట్టారు, మారుతి అబద్దం, చిరుకి తెలుసు: సునీల్

By Bojja Kumar

తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ కమెడియన్‌గా వెలుగొందిన హీరో సునీల్.... హీరోగా టర్న్ అయిన తర్వాత కామెడీ పాత్రలు చేయడం పూర్తిగా మనేశాడు. ఆయన హీరోగా నటించిన '2 కంట్రీస్' మూవీ ఇటీవలే విడుదలైంది. చాలా కాలంగా సునీల్‌కు సరైన హిట్ లేదు. దీంతో ఆయన సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్, శాటిలైట్ రైట్స్ కూడా దారుణంగా పడిపోయింది. అయితే ఒక్క హిట్టు పడితే అంతా సెట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు సునీల్.

ఒక్క హిట్టు పడితే అంతా సెట్టవుద్ది

ఒక్క హిట్టు పడితే అంతా సెట్టవుద్ది

ఓవర్సీస్ మార్కెట్ ఒక్క హిట్టు వస్తే కవర్ అయిపోతుంది. శాటిలైట్‌ విషయంలో మనం ఏమీ చేయలేం. అదో పెద్ద గోల్ మాల్. థియేటర్లో నా సినిమాల కంటే సగం వసూలు చేయని సినిమాలు కూడా శాటిలైట్ మేనేజ్ చేసి అమ్మేసినవి చాలా ఉన్నాయి. కావాలంటే లిస్టు మొత్తం తీస్తాను. అందుకే అది పట్టించుకోవడం లేదు. ఒక్క హిట్టయితే అన్నీ కవర్ అయిపోతాయి.... అని సునీల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Recommended Video

అజ్ఞాతవాసిపై 'మెగా' రిపోర్ట్ ?
సినిమా ఆడక పోతే డబ్బులు తిరిగి ఇచ్చాను

సినిమా ఆడక పోతే డబ్బులు తిరిగి ఇచ్చాను

నేను హీరోగా చేసిన సినిమాలకు రెమ్యూనరేషన్ బ్యాక్ ఇచ్చిన సందర్బాలు ఉన్నాయి. నా వల్ల అయినంత వరకు ఇచ్చేస్తాను. అవతలి వారు జెన్యూన్ పర్సన్ అయితే ఇస్తాను. ఇలాంటివి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. అవతలి పర్సన్ జెన్యూన్ కాకుండా ఫేక్ అయితే నేనూ ఇవ్వను. బలవంతంగా ఇవ్వమంటే అస్సలు ఇవ్వను. వారు చెప్పిన రీజన్ నాకు నచ్చితే. నేను అర్థం చేసుకుంటే ఇస్తాను. లా ప్రకారం చూస్తే వారు నష్టపోయినా మాకు సంబంధం ఉండదు. ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ నాకు ఇవ్వాలనిపిస్తే ఇస్తాను.... అని సునీల్ తెలిపారు.

కోట్లు ఎగ్గొట్టారు

కోట్లు ఎగ్గొట్టారు

ఇండస్ట్రీలో ఇప్పటికీ చెత్త వ్యక్తులు ఉన్నారు. కమెడియన్ గా చేస్తున్నపుడు 15 రోజులు అని చెప్పి 30 రోజులు చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టిన వారు ఉన్నారు. 3 కోట్ల వరకు చెల్లని చెక్స్ ఇంకా నా వద్ద ఉన్నాయి. అపుడు చెక్ బౌన్స్ పెద్ద విషయం కాదు. ఇప్పుడంటే చెక్ బౌన్స్ పెద్ద కేసు. ప్రపంచంలో ఎక్కడైనా సరే మంచి కంటే చెడే ఎక్కువగా ఉంది. మంచిని చూసి చెడును మరిచిపోయి బ్రతికేస్తున్నాం. ఇలాంటి విషయాలు కోటగారిని, బ్రహ్మానందాన్ని అడగండి ఇంకా చాలా చెబుతారు అని సునీల్ తెలిపారు.

మారుతి అబద్దం చెప్పాడు

మారుతి అబద్దం చెప్పాడు

భలే భలే మగాడివోయ్... చేసే ఛాన్స్ ముందు తనకే వచ్చిందనే వార్తలపై సునీల్ స్పందించారు. ఈ విషయంలో మారుతి అబద్దం చెప్పాడన్నారు. మారుతి మొదట నాతో ఒక కథ తీస్తానని చెప్పాడు. అది నాకు నచ్చలేదు. తర్వాత మరో కథ చెప్పాడు అది కూడా నచ్చలేదు. భలే భలే మగాడివోయ్ కథ నాకు నచ్చింది. అపుడు నాకు పాయింటు మాత్రమే చెప్పాడు. మొత్తం కథ చెప్పలేదు. నేను దాన్ని చేయను అని కూడా చెప్పలేదు. ఆ తర్వాత అతడే నన్ను కలవలేదు. నేను ఆ సినిమా చేయను అని మారుతి చెప్పడం పచ్చి అబద్దం అని సునీల్ తెలిపారు.

‘ఒక్కడు’‌లా చేయడానికి నేనేమైనా మహేష్ బాబునా?

‘ఒక్కడు’‌లా చేయడానికి నేనేమైనా మహేష్ బాబునా?

మొన్న ఏదో ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడటం చూశాను. సునీల్ గారికి ఈ కథ చెప్పాను. ఆయన దీన్ని ‘ఒక్కడు' లాగా చేయమని అన్నారు అని చెప్పడం చూశాను. మతి మరుపు కథని ఒక్కడు లాగా చేయమని అడుగుతానా? నేనేమైనా మహేష్ బాబునా? మారుతి ఎవరో చెప్పింది, నేను అనుకుని క్లాష్ అయ్యారేమో? మెమొరీ లాస్ కథను ‘ఒక్కడు' లాగా చేయమని బుద్ది ఉన్న ఎవ్వడూ అడగడు. ఈ విషయంలో ఆయన పూర్తిగా అబద్దం చెప్పాడు.... అని సునీల్ తెలిపారు.

పదేళ్లు తినడానికి కూడా టైమ్ లేనంత బిజీ

పదేళ్లు తినడానికి కూడా టైమ్ లేనంత బిజీ

నా మీద అబద్దాలు చెప్పే వారికి కౌంటర్ ఇస్తూ కూర్చోవడానికి నేను ఇండస్ట్రీకి రాలేదు. అందుకే మారుతి మాటలను పట్టించుకోలేదు అని సునీల్ తెలిపారు. నేను కమెడియన్‌గా చేసే రోజుల్లో పదేళ్లు భోజనంలో నాలుగైదు కూరలు వేసుకుని తినే టైమ్ కూడా లేకుండా తిరిగాను. ఆ వర్క్ కిక్ చూశాను. పని పాటా లేని వారు మాత్రమే సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తూ, ఫోటోలు పెడుతూ కూర్చుంటారు... అని సునీల్ తెలిపారు.

నాకు నిర్మాణ సంస్థ ఉంటే ‘పటాస్’ చేసే వాడినే

నాకు నిర్మాణ సంస్థ ఉంటే ‘పటాస్’ చేసే వాడినే

‘పటాస్' సినిమా నేను చేయాల్సిందే. నాకు ఆ సినిమా బాగా నచ్చింది. అపుడు మా నిర్మాతలకు ఆ కథపై నమ్మకం కుదరలేదు. ఆ సమయంలో నా వెనకాల నిర్మాణ సంస్థ ఉంటే ఆ సినిమా నేనే తీసుకునే వాడిని. ఆ సినిమా పోయినందుకు కాస్త బాధ పడ్డ మాట నిజమే.... అని సునీల్ తెలిపారు.

త్రివిక్రమ్, నేను ఫుడ్ కోసం కష్ట పడ్డాం

త్రివిక్రమ్, నేను ఫుడ్ కోసం కష్ట పడ్డాం

త్రివిక్రమ్, నేను అవకాశాల కోసం వెతుక్కునే రోజుల్లో ఫుడ్ కోసం కష్టపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇంటి వద్ద నుండి డబ్బులు రావడం లేటయినపుడు కూకట్ పల్లి వరకు వెళ్లి తెలిసిన వాడు ఎవడైనా వంద ఇస్తాడేమో అని ప్రయత్నించేవాడిని..... అని సునీల్ గుర్తు చేసుకున్నారు.

రూమ్ రెంటు కట్టడం లేటయితే ఖాళీ చేయమన్నారు

రూమ్ రెంటు కట్టడం లేటయితే ఖాళీ చేయమన్నారు

ఒకసారి మేము రెంటు కట్టడం లేటయితే ఖాళీ చేయమన్నారు. ఆ సమయంలో మా వద్ద డబ్బులు కూడా లేవు. పాత బట్టలన్నీ వెతికితే 20 రూపాయలు దొరికాయి. ఇద్దరం సూట్ కేసులు సర్దుకుని బస్టాండులో కూర్చున్నాం. తర్వాత నేను వెళ్లి ఓనర్స్‌ను ఒప్పించాను.... అని సునీల్ తెలిపారు.

ఆ డబ్బుతో కోక్ కొనడంతో షాకయ్యాను

ఆ డబ్బుతో కోక్ కొనడంతో షాకయ్యాను

అపుడు మా వద్ద ఉన్న 20 రూపాయలు రేపు ఉదయం ఇడ్లీకి, సాయంత్రం క్రీమ్ బన్నుకు సరిపోతాయని సెట్ చేశాను. కానీ త్రివిక్రమ్ ఆ డబ్బుతో కోక్ టిన్ను కొనడంతో షాకయ్యాను . అతడు సగం తాగి, మిగతా సగం నాకు ఇచ్చి.... మన వద్ద ఈ 20 ఉన్నాయి కాబట్టే రేపటి వరకు మనం డబ్బుల గురించి ఆలోచించం, ఇపుడే ఖర్చయిపోతే ఇప్పటి నుండే ఆలోచిస్తాం అన్నాడు.... అంటూ అప్పటి విషయాలను సునీల్ గుర్తు చేసుకున్నారు. ౌ

చిరు మూవీ ఇష్యూ... అసలు విషయం అన్నయ్యకు తెలుసు

చిరు మూవీ ఇష్యూ... అసలు విషయం అన్నయ్యకు తెలుసు

చిరంజీవి గారి ఖైదీ నెం 150 సినిమాకు నేను కమిటైన మాట నిజమే. కానీ అపుడు నేను చేస్తున్న ‘ఈడు గోల్డ్ ఎహె' సినిమాతో ఆ డేట్లు క్లాష్ అయ్యాయి. షూటింగ్ ఆగిపోతే నిర్మాతలకు కోటిన్నర వరకు నష్టం. ఈ విషయం అన్నయ్యకు చెప్పడంతో ఆయన కూడా ఒప్పుకున్నారు. అందుకే చేయలేకపోయాను. కానీ బయట మాత్రం.... రకరకాలుగా కథలు అల్లేశారు. అసలు విషయం అన్నయ్యకు, నాకు తెలుసు. అందుకే ఆ వార్తలను మేము పట్టించుకోలేదు అని సునీల్ అన్నారు.

సైరా సినిమాలో చేస్తున్నాను

సైరా సినిమాలో చేస్తున్నాను

అపుడు ఖైదీ సినిమా మిస్సయింది. ఇపుడు సైరా నరసింహారెడ్డిలో చేస్తానని అన్నయ్యను అడిగా, అన్నయ్య కూడా నువ్వు 100 శాతం చేస్తున్నావన్నారు.... అని సునీల్ తెలిపారు.

త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీలో కూడా

త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీలో కూడా

త్వరలో రాబోతున్న త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో కూడా నేను చేస్తున్నాను..... అని ఈ సందర్భంగా సునీల్ క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X