పవన్ కళ్యాణ్‌ జనసేన పార్టీకి మద్దతిస్తూ సునీల్ ప్రకటన!

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన పార్టీ'కి మద్దతు ఇవ్వడానికి, పవన్ కళ్యాణ్ తరుపున పని చేయడానికి తాను సిద్ధమే అని ప్రముఖ కమెడియన్, హీరో సునీల్ స్పష్టం చేసారు. తన తాజా చిత్రం 'జక్కన్న' ప్రమోషన్లలో ఉన్న ఆయన జనసేన పార్టీకి సంబంధించిన ప్రశ్న ఎదురవ్వగా ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

గత ఎన్నికల సమయంలో పార్టీ మీటింగులతో హడావుడి చేసిన పవన్ ఎన్నికల తర్వాత పార్టీక కార్యకలాపాలను తాత్కాలికంగా పక్కన పెట్టి సినిమాలు చేస్తూ బిజిగా గడుపుతున్నారు. 2019 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ మళ్లీ పొలిటికల్ రంగంలోకి ఎంటర్ అవుతారని, ఈ సారి ఆయన పార్టీ తరుపున అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్.

ఈ నేపథ్యంలో ఇటీవల ఇంటర్వ్యూలో సునల్‌కు పవన్ కళ్యాణ్, ఆయన జనసేన పార్టీకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యారు. దీనిపై సునీల్ స్పందిస్తూ... తాను పవన్ కళ్యాణ్ కు అభిమానిని అని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అడిగితే తాను జనసేన పార్టీకి మద్దతు ఇవ్వడానికి, పార్టీ తరుపున పని చేయడానికి సిద్ధమే అని సునీల్ ప్రకటించారు.

జనసేన పార్టీ తరుపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నకు సునీల్ స్పందిస్తూ.... ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదని, పవన్ కల్యాణ్ అడిగితే పార్టీకి మద్దతు ఇవ్వడం, పని చేయడం లాంటివి చేస్తానని తెలిపారు సునీల్

స్లైడ్ షోలో సునీల్ చెప్పిన మరిన్ని విశేషాలు..

కామెడీ సినిమాలే..

కామెడీ సినిమాలే..

అభిమానులు తన నుండి కామెడీనే కోరుకుంటున్నారని, అందుకే ఎక్కువగా కమెడీ నేపథ్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నట్లు సునీల్ తెలిపారు.

ప్రయోగాలకు దూరం..

ప్రయోగాలకు దూరం..

ప్రయోగాత్మక సినిమాలకు వీలైనంత దూరంగానే ఉంటానని, బిచ్చగాడు మూవీ కథ ముందు తనకే చెప్పినా... నాకు సెట్ కాదనే దాన్ని వదులుకున్నట్లు తెలిపారు సునీల్.

చిరంజీవితో..

చిరంజీవితో..

చిరంజీవిగారు, వినాయ‌క్‌గారి కాంబినేష‌న్‌లో రానున్న సినిమాలో ముందు ఓ క్యారెక్ట‌ర్ చేయ‌మ‌ని అడిగారు. అయితే అదే స‌మ‌యంలో ఈడు గోల్డ్ ఎహే సినిమా క్లైమాక్స్ షూటింగ్ ఉండ‌టంతో అన్న‌య్య‌కు చెప్పాను. ఇప్పుడు ఆ సినిమాలోనే మ‌రో క్యారెక్ట‌ర్ చేస్తున్నాను.

ప్రస్తుతం

ప్రస్తుతం

ప్రస్తుతం గే వీరుపోట్ల గారి ద‌ర్శ‌క‌త్వంలో ఈడు గోల్డ్ ఎహే అనే సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుందని సునీల్ తెలిపారు.

దానికే ఇంపార్టెన్స్‌

దానికే ఇంపార్టెన్స్‌

నేను కామెడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. క‌థ‌లో ఎక్క‌డైనా యాక్ష‌న్ అవ‌స‌ర‌మైతే దాన్ని కూడా సిన్సియ‌ర్‌గానే చేస్తాను. క‌మెడియన్ గా నా కామెడి మిస్ అయిన వారి కోసం సాదార‌ణంగా నేను కామెడి ఎలా చేస్తానో అలాగే జ‌క్క‌న్న సినిమాలో చేశాను. ఎంట‌ర్‌టైనింగ్ మూవీస్‌నే ఎక్కువ‌గా చేయాల‌నుకుంటున్నాను. అన్నారు.

జక్కన్న సినిమా

జక్కన్న సినిమా

సినిమా స‌క్సెస్ కావ‌డం చాలా హ్యాపీగా ఉంది. అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. నా కెరీర్‌లోనే నేను హీరోగా చేసిన సినిమాకు తొలిరోజునే మూడు కోట్ల 75 ల‌క్ష‌ల రూపాయ‌ల ఓపెనింగ్ షేర్ రావ‌డం చాలా పెద్ద గ్రేట్‌. నేను అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X