పవన్‌తో కాదు.. ఎన్టీఆర్‌తో నటిస్తా.. అజ్ఞాతవాసి రూమర్లపై సునీల్ క్లారిటీ
Recommended Video

కమెడియన్‌గా సునీల్ వెండితెరపై అదరగొట్టాడు. కామెడీ రూట్ మార్చి హీరోగా హిట్ కొట్టాడు. అలా వరుస విజయాలు పలకరించడంతో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఫెయిల్యూర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు తాజాగా ఎన్ శంకర్ దర్శకత్ంలో 2 కంట్రీస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలపై స్పందించాడు.

రూమర్లపై హీరో సునీల్ క్లారిటీ
అజ్ఞాతవాసి చిత్రంలో నటించకపోవడంపై మీడియాలో వస్తున్న వార్తలపై సునీల్ క్లారిటీ ఇచ్చారు. అయితే త్రివిక్రమ్‌కు, తనకు మధ్య ఈ విషయంపై చర్చలు జరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల నేను సిద్ధంగా లేకపోవడంతో ఆ సినిమాలో చేయలేకపోయాను.

ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తా
అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కల్యాణ్ పక్కన నటించే అవకాశం దక్కలేదు. కానీ తదుపరి త్రివిక్రమ్ చిత్రంలో తప్పకుండా నటిస్తాను. పవన్‌తో వీలు కుదరకపోయినా ఎన్టీఆర్‌తో తప్పకుండా నటిస్తాను అని సునీల్ అన్నారు.

పవన్ చిత్రంలో నటించకపోవడం
అజ్ఞాతవాసిలో పాత్ర చేయకపోవడం బాధగానే ఉంది. నా కోసం త్రివిక్రమ్ ఎప్పటికైనా మంచి పాత్ర రాస్తారనే నమ్మకం ఉంది. త్వరలోనే అదిరిపోయే పాత్రలో నటిస్తాను. ఫ్యాన్స్, ప్రేక్షకుల కోరికను నెరవేరుస్తాను. అని సునీల్ పేర్కొన్నారు.

పాత్ర నచ్చలేకపోవడమే కారణం
హీరోగా 2కంట్రీస్ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడే అజ్ఞాతవాసి చిత్రంలో నటించే విషయం చర్చల్లోకి వచ్చిందట. హీరో నుంచి కమెడియన్‌కు షిప్టయ్యే క్రమంలో పాత్ర గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ఆ చిత్రం నుంచి డ్రాప్ అయ్యారనే వార్తలు మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సునీల్ స్పందించారు.


Click it and Unblock the Notifications











