»   » బెడ్‌రూంలో సురేఖవాణి సెల్ఫీ.. మరో వివాదంలో హోమ్లీస్టార్..

బెడ్‌రూంలో సురేఖవాణి సెల్ఫీ.. మరో వివాదంలో హోమ్లీస్టార్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో హోమ్లీ యాక్టర్‌గా యాక్టర్ సురేఖకు మంచి పేరు ఉంది. అక్క, వదిన, అమ్మ లాంటి పాత్రలకు పెట్టింది పేరు. వయస్సు పెరుగుతున్న గ్లామర్ కాపాడుకోవడంలో సురేఖ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో సురేఖవాణి యమా యాక్టివ్. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన వీడియో ఒకటి వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా బెడ్‌రూంలో దిగిన ఫొటో కూడా వైరల్‌గా మారింది.

బెడ్‌రూంలో ఫొటో..

బెడ్‌రూంలో ఫొటో..

తాజాగా సురేఖవాణి బెడ్‌పైన పడుకొని దిగిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. పక్కపై పడుకొని సేద తీరడం నాకు చాలా ఇష్టం అనే అర్థం వచ్చే సందేశంతో ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో సురేఖవాణి షేర్ చేసింది. అయితే ఈ ఫొటో ఆమె నివాసంలో దిగిన ఫొటో కాదని, షూటింగ్ సందర్భంగా దిగిన ఫొటో అని కొత్తగా ప్రచారం జరుగుతున్నది.

హాట్ టాపిక్‌గా

హాట్ టాపిక్‌గా

తాజాగా సురేఖ వాణి తన బెడ్‌రూమ్ సెల్ఫీతో హాట్ టాపిక్ గా మారారు. ఇంటి బెడ్ రూంలని సెల్పీల కోసం వాడవచ్చా..? అనే కోణంలో ఇండస్ట్రీలో హాట్ టాక్స్ నడుస్తున్నాయి. అయితే ఈ ఫోటో నిజమైనదా.. కాదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. 100కు పైగా చిత్రాల్లో నటించిన సురేఖావాణి సరదా కోసం పెట్టిన ఫొటో వివాదం కావడం గమనార్హం.

గతంలో వివాదాస్పదమైన వీడియో

గతంలో వివాదాస్పదమైన వీడియో

గతంలో చిట్టి పొట్టి దుస్తులు వేసుకుని తన కూతురుతో కలిసి హాట్ అండ్ సెక్సీ లుక్ సురేఖ వాణి డాన్స్ చేసిన ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. అప్పటి వరకు తెరపై తెలుగింటి ఆడపడుచుగా పద్దతిగా కనిపించిన ఆమెను ఆ వీడియోలో చూసి అంతా షాకయ్యారు. ఆ వీడియో విస్తృతంగా ఇంటర్నెట్‌లో ప్రచారం కావడంతో సురేఖా వాణి చాలా ఇబ్బంది పడింది.

వీడియోను తీయించేందుకు..

వీడియోను తీయించేందుకు..

ఆ వ్యవహారం వల్ల తన కెరీర్‌ ప్రభావం చూపే అవకాశం ఉందని భయాందోళనకు గురైందట. ఆ వీడియోను ఇంటర్నెట్ లో ఎక్కడా కనిపించకుండా తీసి వేయించేందుకు తన ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే దాంతో సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేయడం ఆపలేదు. మరొకరిని పట్టించుకోకుండా తన అభిరుచి మేరకు షూటింగ్ స్పాటైనా, లేదా కారులో వెళ్తున్న ఫొటోలను అభిమానులకు షేర్ చేస్తుంటుంది.

మొగుడు పెళ్ళామ్స్

అనే టెలివిజన్ కార్యక్రమంతో బాగా పాపులర్‌గా మారింది. బొమ్మరిల్లు చిత్రం ఆమెకు మంచి బ్రేక్ తెచ్చి పెట్టింది. ఆ సినిమా తర్వాత అక్క, వదిన వంటి పాత్రలతో బిజీగా ఉంటూ కెరీర్ ని కొనసాగిస్తున్నది.

English summary
She has been the part of more than 100 films in Telugu languages and popular for playing supporting characters. She shared a photograph on her Instagram to grab the attention of her fans and captioned it, “Love To Roll On Bed’. Coming on the pic, she is seen lying on the bed. Her pic is going viral on the internet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu