»   » పవన్ కళ్యాణ్ ధర్మయుద్దం చేస్తున్నారు

పవన్ కళ్యాణ్ ధర్మయుద్దం చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2014 ఎన్నికల్లో బిజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్న తెలుగు స్టార్ హీరో పవన్ కళ్యాణ్‌పై తెలుగు సీనియర్ నటుడు సురేష్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రజల మేలు కోసం, నిస్వార్థంతో ఆయన చేస్తున్న పని ఎంతో మెచ్చుకోదగినదని అంటున్నారు.

Actor Suresh comment about Pawan kalyan

తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎదురిస్తూ పవన్ కళ్యాణ్ ధర్మ యుద్దం చేస్తున్నాడని, ఆయన మనస్పూర్తిగా, ధైర్యంగా తెలుగు వారి కోసం పోరాటం చేస్తున్నాడని, ఆయన పోరాటంలో తప్పక విజయం సాధిస్తాడని అంటున్నారు నటుడు సురేష్. పవన్ ప్రయత్నం వృధా కాదని, దేశంలో రాబోయేది ఎన్టీఏ ప్రభుత్వమే అని ఆయన అంటున్నారు.

గత కొన్నేళ్లుగా సినిమాల్లో కొనసాగుతూ నటుడిగా తనదైన ముద్ర వేసిన నటుడు సురేష్ .....ఒటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. సురేష్ మాట్లాడుతూ... దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, మోడీ మాత్రమే దేశాన్ని రక్షించగలరని చెప్పారు. నరేంద్ర మోడీని టీ అమ్ముకునే వాడిగా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడంపై ఆయన స్పందించారు. మోడీ కేవలం టీ మాత్రమే అమ్ముకున్నారని... కాంగ్రెస్ నేతలు దేశాన్నే అమ్మేశారని విమర్శించారు.

English summary

 "Wholeheartedly Applaud 'Pawan Kalyan" for supporting Modi4PM; Adding X Factor to hard fought Telugu Dharma Yuddham by being A True Braveheart," Actor Suresh commented.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu