»   » ‘బాహుబలి’ పై సురేష్ షాకింగ్ కామెంట్స్

‘బాహుబలి’ పై సురేష్ షాకింగ్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోగా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న నటుడు సురేష్...బాహుబలిపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసి అందరినీ షాక్ చేసారు. అయితే ఆయన చేసిన కామెంట్లలలో అర్దం ఉంది..అని కొందరంటూంటే మరికొందరు ఆయన కామెంట్స్ చేసే విధానాన్ని తప్పు బడుతున్నారు. ఆయన ట్విట్ర్ సాక్షిగా చేసిన కామెంట్స్ ఇక్కడ చదవి..మీరే నిర్ణయంచుకోండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘నేను బాహుబలి మరియు ఎస్ఎస్ రాజమౌళిని సపోర్ట్ చెయ్యను.. ఎందుకంటే జగపతి బాబు లేదా సుమన్ లేదా సాయికుమార్ లాంటి వారు బాహుబలిలోని పాత్రలు చేయడానికి పర్ఫెక్ట్ గా సరిపోతారు కానీ ఆయన అలా ఎందుకు ఆలోచించలేదని' ట్వీట్ చేసాడు.

ఇక సురేష్ అడిగిన దానికి బాహుబలి దర్శకుడు రాజమౌళి ఎలాంటి సమాధానం ఇస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు. మరో ప్రక్క ఒక డైరెక్టర్ గా తన సినిమాలోని పాత్రలకి తనకు నచ్చిన నటుల్ని సెలెక్ట్ చేసుకునే హక్కు డైరెక్టర్ కి ఉంటుంది అని దర్శకుడు రాజమౌళి ని సపోర్ట్ చేస్తున్నారు. మరో ప్రక్క...మన తెలుగు నటులును తెలుగు దర్శకుడే ప్రోత్సహించకపోతే ఎలా అనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Actor Suresh shocking tweets on Bahubali

ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

English summary
Character actor Suresh tweeted, “Will not support Mr.Rajamouli / #Bahubali coz he doesn’t think #jags or #suman or #Saikumar r good Enuff2 play character roles in his film”.
Please Wait while comments are loading...