twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాక్సీవాలా.... కృంగిపోయిన విజయ్ దేవరకొండ, హీరో సూర్య ఓదార్పు!

    |

    Recommended Video

    Actor Suriya Tweet About Vijay Deverakonda's Taxiwaala

    టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ నవంబర్ 17న 'టాక్సీవాలా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చుట్టూ అనేక నీలి నీడలు కమ్ముకున్నాయి. విడుదల ముందే లీక్ అయిపోవడం, పైరసీ సైట్లలో కూడా దర్శనమిస్తుండటంతో చిత్ర యూనిట్ ఆందోళనలో ఉంది.

    ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో కూడా ఈ లీకేజీ అంశం ప్రస్తావించారు విజయ్. దీని వల్ల తమ సినిమా ఎఫెక్ట్ అవుతుందని తాము నమ్మడం లేదని పైకి చెప్పినప్పటికీ వారిలో ఏదో నిరాశ, బాధ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్, దానికి హీరో సూర్య స్పందించిన తీరు చర్చనీయాంశం అయింది.

    విజయ్ దేవరకొండ కృంగిపోయారా?

    ‘‘నేను కృంగిపోయినపుడు... నాలో ఉత్సాహం నిపింపేది ఎవరో మీకు తెలుసు.... అది మీరే. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది'' అనే అర్థం వచ్చేలా విజయ్ దేవరకొండ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

    పాప చనిపోయింది, అదే రోజు సమంత పుట్టినరోజు... సెట్స్‌లో ఏడ్చేసింది! పాప చనిపోయింది, అదే రోజు సమంత పుట్టినరోజు... సెట్స్‌లో ఏడ్చేసింది!

    ఓదార్చిన హీరో సూర్య

    విజయ్ చేసిన ఈ ట్వీట్ మీద తమిళ స్టార్ సూర్య స్పందించారు. విజయ్ దేవరకొండలో ధైర్యం నింపుతూ... సినిమా లీకైన బాధలో ఉన్న విజయ్‌ను ఓదార్చే విధంగా ఆయన ట్వీట్ చేశారు. ఇంతకు ముందు కార్తి, సూర్య సినిమాలు తెలుగులో విడుదలైనపుడు విజయ్ ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.

    అభిమానుల నుంచి మద్దతు

    అభిమానుల నుంచి కూడా విజయ్ దేవరకొండకు మద్దతు లభిస్తోంది. మరోసారి నువ్వు నీ సత్తా చాటుతావనే నమ్మకం మాకు ఉంది అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

    నువ్వు ఎంతో మందికి ఆదర్శం

    డియర్ రౌడీ.... నువ్వు అలా ఫీల్ అవ్వొద్దు. ఎందుకంటే లక్షల మందికి నువ్వు ఆదర్శంగా నిలిచావు. ఎలాంటి సపోర్ట్ లేకుండా సొంత టాలెంటుతో ఎదిగావు. నీ సత్తా ఏమిటో ఈ ప్రపంచానికి మరోసారి చాటుతావనే నమ్మకం ఉంది. నా తరుపున 3 షోలకు మూడు టిక్కెట్స్ కొని థియేటర్లో చూస్తాను అని ఓ అభిమాని ట్వీట్ చేశారు.

    టాక్సీవాలా

    టాక్సీవాలా

    విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్‌ 17న విడుదల కాబోతుంది.

    English summary
    “When I feel low, you know who picks up my spirits? You. Through all the noise, your love comes through to me the loudest.” Vijay Deverakonda tweeted. Actor suriya says "You have all our love! This too shall pass..! But you are here to stay.!! 👍 #Taxiwaala looking forward ....!! TheDeverakonda"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X