దయనీయ స్థితిలో సుశాంత్ పెంపుడు కుక్కలు.. ఇప్పుడు ఎక్కడ? ఎలా ఉన్నాయంటే?
బాలీవుడ్ సినీ వరల్డ్ కి సుశాంత్ సింగ్ మరణ వార్త కోలుకోలేని దెబ్బ కొట్టిందనే చెప్పాలి. చిన్న ఆధారం కూడా ఇవ్వకుండా సుశాంత్ మృతి చెందడం అనేది అందరిని షాక్ కి గురి చేస్తోంది. అసలు సమాధానమే ఇవ్వకుండా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అంటే బలమైన కారణం ఎదో ఉంటుంది అనేలా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సుశాంత్ పెంపుడు కుక్కలకు సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recommended Video

షాకింగ్ రూమర్..
అయితే ఇటీవల సుశాంత్ పెంపుడు కుక్కల్లో ఒకటి మరణించినట్లు సోషల్ మిసియాలో కథనాలు వెలువడడం అందరిని షాక్ కి గురి చేసింది. సుశాంత్ కి నాలుగు పెంపుడు కుక్కలు ఉండగా అందులో ఫుడ్జ్ అనేది చనిపోయినట్లు సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేశారు. దాదాపు చాలామంది అది నిజమనుకొని వాట్సాప్ గ్రూపులలో కూడా షేర్ చేశారు.

అవన్నీ అబద్ధాలే..
సుశాంత్ సింగ్ మృతి చెందిన కోన్నిరోజులకే బాధతో సుశాంత్ సింగ్ పెంపుడు కుక్క మరణించినట్లు కామెంట్స్ రావడం కొందరిని తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ముఖ్యంగా సుశాంత్ సన్నిహితులు ఈ విషయంపై సీరియస్ అయ్యారు. సుశాంత్ ప్రియమైన పెంపుడు కుక్క మరణించలేదు అంటూ సుశాంత్ సన్నిహితులు ప్రముఖ మీడియాకు వివరణ ఇచ్చారు.

వాళ్ళ దగ్గరే ఉన్నాయట..
అంతే కాకుండా సుశాంత్ కి నాలుగు పెంపుడు కుక్కలు ఉన్నాయని అవన్నీ ఇప్పుడు కుటుంబ సభ్యుల సమక్షంలో క్షేమంగా ఉన్నాయని తెలిసింది. అయితే సుశాంత్ ని ఫుడ్జ్ అనే కుక్క ఎక్కువగా మిస్ అవుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. కొన్నిరోజుల వరకు ఆ జీవి ఆహారం కూడా ముట్టలేదట.

సుశాంత్ సింగ్ ని తలచుకుంటూ..
సుశాంత్ సింగ్ లేకపోవడంతో నాలుగు కుక్కల పరిస్థితి కాస్త దయనీయంగా మారిందని టాక్ వస్తోంది. కొన్నిసార్లు ఆహారం కూడా తీసుకోవడం లేవట. మెల్లగా ఒక్కొక్కటి కొలుకుంటున్నట్లు తెలుస్తోంది. సుశాంత్ సింగ్ సింగ్ మరణంతో కుటుంబ సభ్యులు ఇంకా ఆ షాక్ నుంచి కొలుకోలేకపోతున్నారు. సుశాంత్ తండ్రి కూడా ఇంకా కొడుకునే తలచుకుంటూ ఏకాంతంగా కన్నీరు పెట్టుకుంటున్నట్లు బంధువులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











