బెంగళూరు డ్రగ్స్ కేసులో తనీష్.. నోటీసులు జారీ.. అసత్యాలను ప్రచారం చేయొద్దు హీరో ఆవేదన!
కర్ణాటకలో సినీ తారలకు డ్రగ్స్ మాఫియాతో లింకుల వ్యవహారం గత ఆర్నేళ్లుగా సంచలనం రేపుతున్నది. సంజనా గల్రానీ, రాగిణి ద్వివేది లాంటి హీరోయిన్లు అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. అయితే బెంగళూరు డ్రగ్స్ లింకులు ప్రస్తుతం టాలీవుడ్‌కు చేరడం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంలో యువ హీరో తనీష్ స్పందించిన తీరు ఏమిటంటే..

డ్రగ్స్ కేసులో బెంగళూరు నిర్మాత పేరు
టాలీవుడ్ యువ హీరో తనీష్ కొద్దికాలంగా బెంగళూరుకు చెందిన నిర్మాత శంకర గౌడతో ట్రావెల్ అవుతున్నారు. సినిమా నిర్మాణం కోసం ఆయనతో సన్నిహితంగా సంబంధాలు కొనసాగించారు. అయితే డ్రగ్స్ కేసులో బెంగళూరు నిర్మాతకు నోటీసులు రావడం, దాంతో పాటు తనీష్‌కు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నోటీసులు జారీ చేయడం మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే కొద్ది నెలల క్రితం నిర్మాత శంకర్ గౌడ ఏర్పాటు చేసిన పార్టీలో తనీష్ ఉండటంతో నోటీసులు జారీ అయినట్టు సమాచారం.
నాభి అందాలతో ఆకట్టుకుంటున్న సాక్షి అగర్వాల్

కన్నడ నిర్మాతతో తనీష్‌కు సంబంధాలు
బెంగళూరు డ్రగ్స్ కేసులో తనీష్‌కు సంబంధాలు అంటూ మీడియాలో కథనాలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దాంతో తనీష్ వెంటనే స్పందించారు. నాతో బెంగళూరు నిర్మాత సినిమా చేస్తానంటూ గతంలో సంప్రదించిన మాట నిజం. కానీ ఆ ప్రాజెక్ట్ వర్కువుట్ కాలేదు. గత రెండేళ్లుగా ఆయనతో ఎలాంటి కాంటాక్టులోనూ లేను. ఆఫర్ల కోసం ఎందరినో కలుస్తుంటాం. ఆ తర్వాత ఆయనతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు.. అని తనీష్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

నోటీసులు అందిన విషయం నిజమే
తనీష్ వీడియోలో పేర్కొన్న ప్రకారం.. బెంగళూరు నిర్మాత శంకర గౌడతో నాకు సంబంధాలు ఉన్నాయి. డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు అందాయి. కానీ ఆ నోటీసులు ఎందుకు వచ్చాయో అనే విషయం, వాస్తవాలు తెలియకుండా వార్తలు ప్రసారం చేశాయి. నోటీసులు అందడంపై నిజనిజాలు తెలుసుకోవడానికి కనీసం ప్రయత్నం చేయలేదు. నన్ను సంప్రదించి ఉంటే అసలు విషయాన్ని చెప్పే వాడిని. మీడియా వార్తలు నా కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయి అంటూ తనీష్ పేర్కొన్నారు.

వివరణ అడిగేందుకు మాత్రమే
డ్రగ్స్ కేసులో నాకు వచ్చిన నోటీసులకు కారణం వేరు. ఆ వ్యవహారంలో కొన్ని విషయాల గురించి వివరణ అడిగేందుకు నాకు నోటీసులు జారీ చేశారు. అంతేగానీ నాకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. నేను డ్రగ్స్ వినియోగించినందుకు నాకు నోటీసులు పంపలేదు. ఇలాంటి విషయాలపై నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు రాశారు అని తనీష్ ఆవేదన వ్యక్తం చేశారు.

నా ఫ్యామిలీ కలతకు గురై
బెంగళూరు డ్రగ్స్ కేసులో తనీష్ అంటూ మీడియాలో వార్తలు రావడంతో నా ఫ్యామిలీ కలతకు గురైంది. ఇలాంటి అసత్యాలతో కూడిన వార్తలను ప్రసారం చేయకండి. నన్ను సంప్రదించి వాస్తవాలు తెలుసుకొండి. దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయకండి అంటూ మీడియాను తనీష్ కోరారు.


Click it and Unblock the Notifications











