‘సరిహద్దు’ సైనికుడుగా తనీష్.. మళ్లీ ఆ దర్శకుడికే గ్రీన్ సిగ్నల్
సైనికుడు సరిహద్దుకు కాదు దేశానికే రక్షకుడు. ఇదే కాన్సెప్ట్ తో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తనీష్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. తనీష్ గత సినిమా రంగుతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న కార్తికేయ ఈ చిత్రానికి దర్శకుడు. అంటే రంగు కాంబినేషన్ రిపీట్ అవుతోందన్నమాట. నేషనలైజ్డ్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం టైటిల్ కూడా 'సరిహద్దు'.

సరికొత్త కాన్సెప్ట్‌తో సరిహద్దు
సరిహద్దు టైటిల్ లోగో రిలీజ్ సందర్బంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ " భాషను నేర్చుకొని జ్ఞానాన్ని సంపాదించాలనుకొని...ప్రతి భాషకు ఒక "తెగ "అనీ...కొన్ని తెగలకు ఒక "కులం "అనీ.. కొన్ని కులాలు కలసి ఒక "మతం" అనీ విడిపోతూ మృగలనుండి మనుషులుగా.. మనుషులనుండి "తెగలుగా" ... తెగలనునుండి.. "కులాలుగా"..కులాలనుండి "మతాలుగా"....మతాలనుండి "రాష్ట్రాలుగా".... రాష్ట్రాలనుంచి "దేశాలుగా"..సరిహద్దుల్ని గీసుకొంటూ...బతుకుతున్నాం. ఈ కాన్సెప్ట్ తో సరిహద్దు రూపొందబోతుంది " అన్నారు.

రంగు సినిమాకు క్రిటిక్స్ ప్రశంసలు
సరిహద్దు సినిమాకు ముందు తనీష్, కార్తీకేయ రంగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బెజవాడ రౌడీ షీటర్ కథా నేపథ్యంగా రంగు రూపొందింది. ఈ సినిమాకు సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రంగు సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో సరిహద్దుకు చేతులు కలిపారు.

రంగు సినిమాకు ప్రశంస
దర్శకుడు కార్తికేయ, హీరో తనీష్ ‘రంగు' సినిమాతో అద్భుతమైన ప్రశంసలు అందుకున్నారు. అందుకే మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమాకు రంగం సిద్ధమైంది. ఈ సారి అంచనాలు కూడా ఉంటాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఓ అద్భుతమైన కథతోనే మళ్లీ వస్తున్నారు ఈ ఇద్దరు. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ విడుదల చేయబోతోన్న ‘సరిహద్దు' మూవీ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కాబోతోంది.

త్వరలోనే సాంకేతిక నిపుణుల..
త్వరలోనే సాంకేతిక నిపుణుల ఎంపిక
టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రంలో తెలుగుతో పాటు హిందీ భాషా నటులు కూడా నటిస్తారు. ప్రస్తుతం టైటిల్ తోనే విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఈ టీమ్.. సినిమాకు సంబంధించిన వివరాలతో పాటు ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కు సంబంధించిన వివరాలను ఈ నెలాఖరులో తెలియజేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











