For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నా.. నా కెరీర్ పాడవుతుంది.. నన్ను వదిలేయండి: తనీష్ కంటతడి

By Rajababu
|

డగ్ర్స్ కేసులో నోటీసులు అందుకొన్న సినీ నటుడు తనీష్‌ను సోమవారం నాలుగు గంటల పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు విచారించారు. డ్రగ్స్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని, తన వ్యక్తిగత అలవాట్లను ఈ విచారణలో అధికారులకు వెల్లడించినట్టు తెలిసింది. సిగరెట్లు, గంజాయి అలవాటు ఉందని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పలు కోణాల్లో సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులు ప్రయత్నించినట్టు తెలిసింది. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని, తప్పకుండా హాజరుకావాలని తనీష్‌కు అధికారులు సూచించినట్టు తెలుస్తున్నది.

డ్రగ్స్ సప్లయర్లతో సంబంధం గురించి

డ్రగ్స్ సప్లయర్లతో సంబంధం గురించి

డ్రగ్స్ వాడకం, కొనుగోలు, ఇతర అంశాల గురించి తనీష్‌పై ప్రశ్నలను సంధించినట్టు అధికారులు పేర్కొన్నారు. విచారణ సందర్భంగా సినీ పరిశ్రమకు, డ్రగ్స్ సప్లయర్లకు ఉన్న సంబంధాల గురించి మరిన్ని విషయాలు తమ దృష్టికి వచ్చినట్టు తెలుస్తున్నది. విచారణ సందర్భంగా రక్తం, గోళ్ల నమూనాలను సేకరించకపోవడం గమనార్హం. సోమవారం విచారణలో సినీ పరిశ్రమకు సంబంధం లేదని మరో ఇద్దరిని

మూడుగంటలపాటు విచారణించినట్టు సమాచారం.

Hyderabad drugs Case : Puri Jagannadh appears before SIT
తనీష్‌పై ప్రశ్నల వర్షం

తనీష్‌పై ప్రశ్నల వర్షం

డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్, జీషాన్ వద్ద మీ ఫోన్ నంబర్ ఎందుకు ఉంది? వారితో వాట్సప్, ఫోన్‌‌లో ఎందుకు సంభాషించారు? మిగితా సినీ ప్రముఖులకు డ్రగ్స్ తీసుకొనేవారా? సినిమా రంగంలో డ్రగ్స్ ఎవరెవరూ వాడుతారు? ఎక్కడ నుంచి వారికి అందుతాయి? డ్రగ్స్ రాకెట్‌తో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? అనే ప్రశ్నలను అధికారులు సంధించడంతో తనీష్ ఉక్కిరిబిక్కిరి అయినట్టు సమాచారం.

సినీ పెద్దలకు సంబంధం

సినీ పెద్దలకు సంబంధం

అధికారుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయిన తనీష్ .. సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నా. డ్రగ్స్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు. మాదక ద్రవ్యాలు వాడను. పబ్బులు, క్లబ్బులకు వెళ్లే అలవాటు లేదు. పరిశ్రమలో డ్రగ్స్ వాడేవారు చాలా మందే ఉన్నారు. సినీ పరిశ్రమలో పెద్దవాళ్లకు డ్రగ్స్ సరఫరా చేసే వాళ్లు ఉన్నారు. చిన్నవాళ్లం.. మమ్మల్ని వదలేయండి అని అధికారులను వేడుకున్నట్టు సమాచారం.

తండ్రి మరణంతో విషాదం..

తండ్రి మరణంతో విషాదం..

తండ్రి మరణంతో విషాదంలో ఉన్నాను. ఇంటి బాధ్యతలు నాపై ఉన్నాయి. సినిమాలు లేక ఇబ్బందులు పడుతున్నాను. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యవహారంలో ఇరుక్కుపోవడం ఫ్యామిలీ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు అని తనీష్ కంటతడి పెట్టుకున్నట్టు సమాచారం. మనసు బాగాలేకుంటే.. లేదా పార్టీలు జరిగినప్పుడు స్నేహితులతో సిగరెట్, మద్యం తాగేవాడిపి, కొన్ని సందర్భాల్లో గంజాయిని కూడా సిగరెట్లలో కలిపి వాడేవాళ్లం అని చెప్పినట్టు తెలిసింది.

మీడియా నిర్ధారించుకోవాలి..

మీడియా నిర్ధారించుకోవాలి..

సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని విచారణ అనంతరం హీరో తనీష్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సిట్ విచారణ అనంతరం ఎైక్సెజ్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ విషయంలో కథనాలు ప్రసారం చేసే ముందు వాటిని నిర్ధారణ చేసుకోవాలని తనీష్ విజ్ఞప్తిచేశారు. నిరాధార కథనాలతో తమ కుటుంబాలు కుంగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
In Tollywood drug case actor Tanish was quizzed by The SIT officials on monday. after interrogation Speaking to the media, Tanish said that the interrogation went well and he answered the questions posed by SIT. He suggested that Before Airing the news, media should confirm that facts and files of the case.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more