డోంట్ రీడ్ దిస్...... హీరో ఉపేంద్ర మరో సెన్సేషన్!
కన్నడ నటుడు ఉపేంద్ర త్వరలో తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కన్నడ నటుడు ఉపేంద్ర ఏ పని చేసినా సంచలనం అయ్యేలా చేస్తారు. ఆయన నటించిన కొన్ని సినిమా టైటిల్స్ గమనిస్తే..... ష్, ఎ, రా, హెచ్ టు ఓ ఇలా డిఫరెంటుగా ఉన్నాయి. త్వరలో ఉపేంద్ర తన ఆత్మకథ పుస్తకాన్ని రిలీజ్ చేయబోతున్నారు. దీనికి టైటిల్ కూడా విచిత్రంగా పెట్టారు.
'ఇదన్నా ఓడ్‌బేడి' అనే కన్నడ టైటిల్ తో ఈ పుస్తకం రిలీజ్ చేయబోతున్నారు. అంటే 'డోంట్ రీడ్ దిస్' (దీన్ని చదవొద్దు) అని అర్థం. త్వరలో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడానికి ఉపేంద్ర ప్లాన్ చేస్తున్నారు.

ఈ పుస్తకంలో ఏముంటుంది?
ఉపేంద్ర జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఫోకస్ చేస్తూ ఈ ఆటోబయోగ్రఫీ ఉండబోతోంది. ఉపేంద్ర రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారుతున్న నేపథ్యంలో ఆయన పొలిటికల్ ఫ్యూచర్‌కు హెల్ప్ అయ్యేలా ఈ పుస్తకం ఉంటుందని భావిస్తున్నారు.

రాజకీయ పార్టీని స్థాపించిన ఉపేంద్ర
ప్రస్తుతం ఉపేంద్ర నటుడిగా వరుస సినిమాలు చేస్తున్నారు. దీంతో పాటు దర్శకుడిగా కూడా సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఓ వైపు ఇవి చేస్తూనే... ఇటీవలే ‘కర్నాటక ప్రగ్నాయవంత జనతా పక్ష' పేరుతో సొంతగా రాజకీయ పార్టీని స్థాపించారు.

గతంలో రెండు పుస్తకాలు రిలీజ్ చేసిన ఉపేంద్ర
గతంలో ఉపేంద్ర రెండు పుస్తకాలు విడుదల చేశారు. అయితే ఈ సారి పూర్తి స్థాయిలో తన ఆత్మకథను పుస్తకంలో పొందుపరచనున్నారు. మొత్తం 144 పేజీలతో ఈ పుస్తకం ఉండబోతోంది. ఈ ఆటోబయోగ్రఫీ కోసం అభిమానులు, కన్నడ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పొలిటికల్ మైలేజ్ కోసమేనా?
రాజకీయ పార్టీని స్థాపించిన కొద్దిరోజుల్లోనే ఉపేంద్ర తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని లాంచ్ చేయడం చర్చనీయాంశం అయింది. పొలిటికల్ మైలేజ్ కోసమే ఉపేంద్ర ఇపుడు ఈ పుస్తకాన్ని లాంచ్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











