For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుద్దాలకు సర్జరీ.. చిరు మాటలే కొండంత ధైర్యం.. అసలు విషయం చెప్పిన ఉత్తేజ్

  |

  సోషల్ మీడియా కాలంలో ఏది నిజమో ఏది అబద్దమో వెంటనే నమ్మేందుకు వీలు లేదు. ఏదైనా సరే అది ఏ విషయమైనా సరే అధికారిక వ్యక్తులు తమంతట తాము స్పందిస్తే గానీ ఆ వార్తలకు విలువ ఉండదు. నిన్న, మొన్న ప్రసిద్ద గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యంపై వార్తలు వచ్చాయి. వాటిని కొందరు సినీ ప్రముఖులు ఖండించారు. అయితే తాజాగా నటుడు ఉత్తేజ్ ఆ వార్తలపై స్పందిస్తూ అదంతా నిజమేనని క్లారిటీ ఇచ్చాడు. అసలు ఏం జరిగిందో ఓ వీడియో ద్వారా వివరించాడు.

  ఆ ప్రకటనతో ఓ క్లారిటీ

  ఆ ప్రకటనతో ఓ క్లారిటీ

  మొదటగా సుద్దాల ఆరోగ్య విషయమై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మొదట అవన్నీ అబద్దమని కొట్టిపారేశారు. అయితే సుద్దాల అశోక్ తేజకే ఆరోగ్యం బాగా లేదని, ఆయనకి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగనున్నట్లుగా చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సుద్దాల అశోక్ తేజకి వరసకి అల్లుడైన్ ఉత్తేజ్ ఆయన ఆరోగ్యంపై వివరణ ఇచ్చాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు.

  ఆ వార్తలు నిజమే..

  ఆ వార్తలు నిజమే..

  ఉత్తేజ్ మాటల సారాంశం.. నమస్తే.. సుద్దాల అశోక్ తేజగారు మా మామయ్య. లిరిసిస్ట్ అనే విషయం అందరికీ తెలుసు. తను అనారోగ్యంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వస్తుంది. అది నిజమే. అయితే ఆయన ఈరోజు(మే 22) హాస్పటల్‌లో జాయిన్ అవుతున్నారని. రేపు (23) సాయంత్రం సర్జరీ ఉందని క్లారిటీ ఇచ్చాడు.

  అలా వైరల్ అయింది..

  అలా వైరల్ అయింది..

  ఆయన తన ఫ్రెండ్‌తో బ్లడ్ అవసరం ఉంటుందేమో అని చెబితే.. అతను ఫేస్‌బుక్‌లో పెట్టేశాడని చెప్పుకొచక్చాడు. దాంతో అలా సోషల్ మీడియా మొత్తం మామయ్య ఆరోగ్యం గురించి రకరకాలుగా వచ్చాయాని, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. కానీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని మరోసారి వివరంగా చెప్పాడు.

  రక్తం అవసరం ఏర్పడింది..

  రక్తం అవసరం ఏర్పడింది..

  రక్తం అవసరం ఏర్పడటంతో వెంటనే తాను చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు ఫోన్ చేశానని తెలిపాడు. అక్కడ స్వామినాయుడు, ముఖేష్‌ వెంటనే రియాక్ట్ అయ్యారని చెప్పుకొచ్చాడు. బ్లడ్ డొనేటర్స్‌ని పంపించడం కూడా జరిగిందని పేర్కొన్నాడు. మామయ్య మీద గౌరవంతో, ప్రేమతో ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగిన వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అని తెలిపాడు.

  వెంటనే చిరంజీవి స్పందించారు..

  వెంటనే చిరంజీవి స్పందించారు..

  వెంటనే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విషయం తెలియడంతో మార్నింగ్ ఫోన్ చేసి మామయ్యకు ఎలా ఉందని కనుక్కున్నారని తెలిపాడు. వీలైతే మామయ్యతో మాట్లాడించు అని చెప్పారని పేర్కొన్నాడు. తాను వెంటనే మామయ్యతో అన్నయ్య చిరంజీవితో మాట్లాడించానని తెలిపాడు. అన్నయ్య మాటలు మామయ్యకు కొండంత ధైర్యాన్ని, కొండంత నమ్మకాన్ని కలిగించాయని అన్నాడు.

  కొండంత ధైర్యం వచ్చిందన్నారు..

  కొండంత ధైర్యం వచ్చిందన్నారు..

  చిరంజీవితో మాట్లాడిన అనంతరం.. టోటల్ పరిశ్రమే తనతో మాట్లాడినట్లుగా, ఎంతో ధైర్యంగా హాస్పటల్‌కు వెళుతున్నానురా అని సుద్దాల పేర్కొనట్టు ఉత్తేజ్ తెలిపాడు. చిరంజీవి సహృదయతకు కృతజ్ఞుడిని, సుద్దాల అశోక్ తేజగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారని, మనందరి అభిమానం, ప్రేమతో ఆయన హ్యాపీగా బయటికి వచ్చి మళ్లీ బోలెడన్ని పాటలు రాస్తారని కోరుకుందామని జరిగిన కథ అంతా వివరించాడు.

  English summary
  Actor Uttej About Suddala Ashok Teja Health News. Uttej Says That Now He Is Fine, Today He Is Going To Take Surgery. Chiranjeevi Also Worried About His health Issues.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X