భార్య మరణంతో గుండెలు పగిలేలా ఏడ్చిన ఉత్తేజ్.. చిరంజీవి కంటతడి, కన్నీరుమున్నీరైన ప్రకాశ్ రాజ్, జీవిత (వీడియో)
తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాలకు దూరంగా ఉండే నటుడు ఉత్తేజ్ తీవ్ర విషాదంలో కూరుకుపోయాడు. ఉత్తేజ్ స్థాపించిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఆయన సతీమణి క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ మరణించారు. దాంతో ఆయన కుటుంబమే కాకుండా కూడా సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. చిరంజీవి, ప్రకాశ్ రాజ్, జీవిత రాజశేఖర్ లాంటి సినీ ప్రముఖులు బసవతారకం హాస్పిటల్‌కు ఉత్తేజ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి పెడుతూ కనిపించారు. ఈ విషయాల్లోకి వెళితే..
Recommended Video

ఫిల్మ్ ఇన్సిట్యూట్ నిర్వాహకురాలిగా
ఉత్తేజ్ పద్మావతి విషయానికి వస్తే.. ఉత్తేజ్ స్తాపించిన యాక్టింగ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ మయూఖ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ గత కొద్దికాలంగా నిర్వహిస్తున్నారు. ఔత్సాహిక నటులకు కౌన్సిలింగ్‌తోపాటు వారికి మార్గ నిర్దేశకత్వం చేస్తున్నారు. అయితే అనూహ్యంగా క్యాన్సర్ బారిన పడి కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో బసవతారకం హాస్పిటల్‌లో చేర్పించారు.

బసవతారకం హాస్పిటల్‌కు సినీ ప్రముఖులు
ఉత్తేజ్ భార్య పద్మావతి ఇక లేరనే వార్తను తెలుసుకొన్న సినీ ప్రముఖులు హుటాహుటిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు చేరుకొన్నారు. పుట్టెడు దు:ఖంలో ఉన్న ఉత్తేజ్‌ను గుండెలకు హత్తుకొని ఓదార్చారు. తన కష్టంలో తాము భాగం పంచుకొంటామంటూ ఆసరాగా, అండగా నిలిచారు.
అన్నయ్య అన్నయ అంటూ ఉత్తేజ్ భోరుమంటూ
భార్య పద్మావతి కన్నుమూసిన క్రమంలో తనకు సంతాపం తెలియడానికి వచ్చిన చిరంజీవి కాళ్లపై పడి గుండెలు పగిలేలా ఉత్తేజ్ రోదించాడు. ఓ దశలో ఉత్తేజ్‌ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అన్నయ్య.. అన్నయ్య అంటూ ఉత్తేజ్ కన్నీరుమున్నీరయ్యాడు. నా జీవితంలో అన్నీ తానే చూసుకొనే వారు అంటూ భోరున విలపించాడు. ఉత్తేజ్‌ను ఓదార్చుతూ చిరంజీవి కూడా కంటతడి పెట్టుకొన్నారు. దాంతో ఒక్కసారిగా అందరూ ఎమోషనల్ అయ్యారు.
ప్రకాశ్ రాజ్ కంటతడి పెట్టుకొని..
ఉత్తేజ్ భార్య పద్మావతి మరణించారనే వార్త తెలుసుకొన్న ప్రకాశ్ రాజ్ వెంటనే బసవతారకం హాస్పిటల్‌కు వచ్చి ఉత్తేజ్‌ను ఓదార్చాడు. ఓ దశలో ఓదార్చడం తనకు మించిన భారం కావడంతో గోడకు నిలబడి ధీనంగా ఏడుస్తూ కనిపించారు. ప్రకాశ్ రాజ్ కంటతడి పెట్టుకోవడం అందర్నీ మరింత విషాదంలోకి నెట్టింది.

జీవితను పట్టుకొని మయూఖ ఏడుస్తూ..
ఉత్తేజ్‌ను ఓదార్చడానికి వచ్చిన జీవితా రాజశేఖర్ వచ్చారు. జీవితను గట్టిగా పట్టుకొని ఉత్తేజ్ కూతురు మయూఖ కన్నీరుమున్నీరయ్యారు. అమ్మ ఇకలేరు అంటూ భోరున విలపించారు. బాధలో మయూఖను ఆపడం జీవితా రాజశేఖర్‌కు కూడా కష్టంగా మారింది. ఓ దశలో జీవితా రాజశేఖర్ కూడా భోరున విలపించారు. హాస్పిటల్‌లో పరిస్థితి మరింత గంభీరంగా మారింది.

మహాప్రస్థానంలో అంత్యక్రియలు
సెప్టెంబర్ 13 వ తేదీ ఉదయం మరణించిన ఉత్తేజ్ సతీమణి పద్మావతికి మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఉత్తేజ్‌కు సంతాపం తెలియజేస్తూ ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఉత్తేజ్‌కు నాని, ఇతర సినీ ప్రముఖుల సంతాపం
నటుడు ఉత్తేజ్‌కు సంతాపం తెలిపిన వారిలో నేచురల్ స్టార్ నాని, ఏడిద శ్రీరాం, బ్రహ్మాజీ ఉన్నారు. సినీ హీరో నాని ట్వీట్ చేసి.. ఉత్తేజ్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











