శ్రీరెడ్డిని వ్యభిచార కేసులో అరెస్ట్ చేయండి.. తమిళ హీరో ఫిర్యాదు.. త్రిష ఫైర్

By Rajababu

Recommended Video

శ్రీ రెడ్డి పై కేసు నమోదు చేసిన నటుడు వారాహి

తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న వివాదాస్పద నటి శ్రీరెడ్డికి చెన్నైలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఏఆర్ మురగదాస్, సుందర్ సీ, లారెన్స్ రాఘవపై సంచలన ఆరోపణలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిపై తమిళ నటుడు వారాహి కేసు నమోదు చేశారు. తన ఫిర్యాదులో తీవ్రమైన ఆరోపణలు చేయడం గమనార్హం.

శ్రీరెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నది..

శ్రీరెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నది..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి టాలీవుడ్ సినీ నటులు, ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసింది. కొందరిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నది. ఇప్పుడు అదే పద్దతిని తమిళ పరిశ్రమలో చేస్తున్నది. కావున శ్రీరెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని వారాహి పోలీసులను కోరారు.

శ్రీరెడ్డిని అరెస్ట్ చేయండి

శ్రీరెడ్డిని అరెస్ట్ చేయండి

లైంగిక వేధింపులకు ఆధారాలున్నాయని ప్రశ్నించిన ఓ మహిళా జర్నలిస్టును కించపరిచేలా వ్యాఖ్యాలు చేసింది. నా మర్మంగంలో కెమెరా పెట్టుకోవాలా? అని ప్రశ్నించింది. వేషాల కోసం తాను వ్యభిచారం చేయాల్సి వచ్చిందనే విధంగా మాట్లాడిందని వారాహి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. వ్యభిచారం కేసులో శ్రీరెడ్డి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

సీనియర్ తారల ఆగ్రహం

సీనియర్ తారల ఆగ్రహం

శ్రీరెడ్డి వ్యవహారంపై తమిళ చిత్ర పరిశ్రమలోని సీనియర్ హీరోయిన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా మాట్లాడవద్దు. ఏ పరిశ్రమ అయినా మంచి, చెడు రెండు ఉంటాయి. ప్రచారం కోసం మహిళలు, సినీ హీరోయిన్ల గౌరవానికి మచ్చ తేవొద్దని పలువురు సూచిస్తున్నారు.

శ్రీరెడ్డి వివాదంపై త్రిష ఫైర్

శ్రీరెడ్డి వివాదంపై త్రిష ఫైర్

శ్రీరెడ్డి వివాదంపై అందాల నటి త్రిష తీవ్రంగా స్పందించారు. అలాంటి విషయాలకు బదులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు శ్రీరెడ్డి అంటే ఎవరో తనకు తెలియదు. ఆమె గురించి ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ వివాదానికి ప్రచారం చేయవద్దు. దీనిని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు అని అన్నారు.

మద్దతు ఇవ్వవద్దని త్రిష విన్నపం

మద్దతు ఇవ్వవద్దని త్రిష విన్నపం

తప్పుడు ఆలోచనలతో వివాదాలు సృష్టించేవారికి తమిళ సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరూ సహకరించవద్దు. శ్రీరెడ్డికి మద్దతుగా నిలుస్తున్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. క్యాస్టింగ్ కౌచ్‌‌ పేరుతో వివాదాలు సృష్టించడం మానుకోవాలి అని ఐశ్వర్య మీనన్, అర్తన లాంటి యువ హీరోయిన్లకు త్రిష సూచించారు.

చెన్నైలో శ్రీరెడ్డి కలకలం

చెన్నైలో శ్రీరెడ్డి కలకలం

తమిళ చిత్ర పరిశ్రమలో వివాదాలు సృష్టించవద్దని శ్రీరెడ్డికి నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ ఇప్పటికే హెచ్చరించారు. అయినా వారి మాటలను పెడచెవిన పెట్టింది. చెన్నైలో ఉంటూ మీడియాలో ప్రముఖంగా మారింది. అయితే శ్రీరెడ్డి వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో అనే విషయంపై సినీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X