వెన్నెల కిషోర్ అల్లరి పనికి నెటిజన్స్ ఫిదా.. అది చూపిస్తూ పిక్.. ఇంతకీ ఏం చేశాడంటే
కొందరు తెరపై మాత్రమే హాస్యాన్ని పండిస్తారు. కానీ తెర వెనుక మహా కోపిష్ఠిలా ఉంటారు. ఇంకొంతమంది తెర వెనుక సరదాగా సందడి చేస్తున్నా.. తెరపైకి వచ్చేసరికి విపరీతమైన కోపాన్ని నటిస్తారు. అయితే కొంతమంది మాత్రమే.. తెర ముందు.. తెర వెనకాల ఒకేరకంగా ఉంటారు. అలాంటి వారిలో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఒకరు.

దూసుకుపోతున్న కమెడియన్...
ఒక్కప్పుడు బ్రహ్మానందం ఉంటే సినిమా హిట్టు అని మాట్లాడుకునేవారు. ఆ తరువాత ఆ స్థానాన్ని సునీల్ కొంతకాలం ఆక్రమించాడు. కానీ హీరో కావాలన్న ఆశతో.. కాలక్రమంలో వెనకబడ్డాడు. ఇక ఇప్పుడు వెన్నెల కిషోర్ టైమ్ నడుస్తోంది. అది ఏ సినిమా అయినా సరే.. వెన్నెల కిషోర్ ఉంటే అది వేరే లెవెల్ అవుతుంది. తన కామెడీ ట్రాక్ పై జనాలకు అంతగా నమ్మకం ఉంటుంది. అందుకే ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాలో దాదాపు కనిపిస్తూనే ఉంటాడు.

హీరోకు సమానంగా పోటీ...
కొన్ని సినిమాలు వెన్నెల కిషోర్ వల్లే నిలబడుతాయంటే అందులో అతిశయోక్తి లేదు. తాజాగా వచ్చిన మన్మధుడు2 చిత్రంలో ఈయన కామెడీనే హైలెట్ అయింది. కొందరైతే.. వెన్నెల కిషోర్ లేకుంటే సినిమానే లేదు అని కామెంట్స్ చేశారు. అదీ ఆ కమెడియన్ స్థాయి. అయితే ఈయన ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడు.

ఫన్నీ క్యాప్షన్స్ తో పోస్టింగ్లు..
సినిమాల్లో ఇతను ఇచ్చే హావభావాలకు అందరూ ఫిదా అవుతుంటారు. అయితే సోషల్ మీడియాలోనూ ఆలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ పిక్స్ పోస్ట్ చేస్తుంటాడు. వాటికి అదిరిపోయే టైమింగ్ తో క్యాప్షన్ ఇస్తాడు. ఇక వాటికి నెటిజన్స్ కామెంట్స్ లైక్స్ షేర్ లు కొడతారు.. అలాంటి ఓ పిక్.. క్యాప్షన్ ప్రస్తుతం ఒకటి వైరల్ అవుతోంది.

'వెల్కమ్ బ్యాక్' అంటూ ఓ పోస్ట్..
'వెల్కమ్ బ్యాక్' అంటూ తన బ్యాక్ చూపిస్తూ ఉన్న ఒక పిక్ ను పోస్ట్ చేశాడు. దీనికి ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. తన అసిస్టెంట్ ఎప్పుడూ అతని క్రియేటివిటీతో ఇలాంటివే చేస్తుంటాడు.. వెల్కమ్ బ్యాక్ అనుకున్నాడమే అందుకే బ్యాక్ నుంచి ఫోటో తీసాడని ఫన్నీ గా పోస్ట్ చేశాడు. దీనికి నెటిజన్స్ ఓ రేంజీలో స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











