Venu Madhav మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు రియాక్షన్.. ట్విట్టర్ వేదికగా

ప్రముఖ నటుడు, టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మృతి చెందారనే వార్త యావత్ సినీలోకాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. ఆయన మరణవార్త తెలిసి సినీ, రాజకీయ వర్గాల్లోని ప్రముఖులు తమ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. తాజాగా వేణుమాధవ్ మృతి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు.

 సినీ, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు

సినీ, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు

కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతితో టాలీవుడ్ చిత్రసీమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓ మంచి మనిషిని కోల్పోయామని కలత చెందుతున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు.

టీడీపీ అధినేత చంద్రబాబు సానుభూతి

''మిమిక్రీ కళాకారుడిగా, సినీ హాస్య నటుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన వేణుమాధవ్ మృతి విచారకరం. తెదేపా ఎన్నికల ప్రచారంలోనూ తనదైన ప్రత్యేకతతో ప్రజలని ఆకట్టుకున్నారు. వేణుమాధవ్ మృతికి నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'' అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.

Recommended Video

#RIPVenuMadhav : Comedian Venu Madhav Is No More
సినీరంగంలోకి వేణు మాధవ్

సినీరంగంలోకి వేణు మాధవ్

1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘సంప్రదాయం' చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు వేణు మాధవ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ' సినిమాతో మంచి బ్రేక్ తెచ్చుకొని తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్‌గా రాణించారు. అదే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హంగామా' సినిమాతో హీరో కూడా అయ్యారు వేణు మాధవ్.

వేణు మాధవ్ స్వస్థలం

వేణు మాధవ్ స్వస్థలం

వేణు మాధవ్ స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్. సూర్యపేట జిల్లా కోదాడలో సెప్టెంబర్ 28 వ తేదీ 1968 సంవత్సరంలో ఆయన జన్మించారు. వేణు మాధవ్ తండ్రి టెలిఫోన్ డిపార్ట్‌మెంట్ లో లైన్‌ ఇన్‌స్పెక్టర్ పనిచేసేవారు. అమ్మ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ గా పని చేసేది. 5వ తరగతి దాకా ఊళ్ళోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న ఆయన.. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులేయడం, వారిని అనుకరించి మాట్లాడటం లాంటివి చేసి ఆకర్షించేవారు.

వేణు మాధవ్ సినీ జర్నీ.. రాజకీయాల్లోనూ

వేణు మాధవ్ సినీ జర్నీ.. రాజకీయాల్లోనూ

ఆది, సొంతం, ప్రియమైన నీకు, తొలిప్రేమ, సింహాద్రి, సై, ఛత్రపతి, దిల్, సాంబ, వెంకీ, తమ్ముడు, పోకిరి, ఖతర్నాక్, యోగి, దేశముదురు, సంక్రాంతి, మాస్, అతనొక్కడే తదితర సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల మన్ననలు పొందారు వేణు మాధవ్. పలు టీవీ షోల్లో హోస్ట్‌గా కూడా చేశారు. రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చూపించారు వేణు మాధవ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X