twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Venu Madhav జ్ఞాపకాలను నెమరు వేసుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి.. మొదటిసారి చూసింది అక్కడే!

    |

    ప్రముఖ నటుడు, టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మృతి చెందారనే వార్త యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. ఆయన మరణవార్త తెలుసుకొని టాలీవుడ్ ప్రముఖులు తమ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అతనితో చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా వేణుమాధవ్ మృతిపై సీనియర్ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి స్పందించారు.

     టాలీవుడ్ చిత్రసీమలో విషాద ఛాయలు

    టాలీవుడ్ చిత్రసీమలో విషాద ఛాయలు

    కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వేణుమాధవ్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతితో టాలీవుడ్ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓ మంచి మనిషిని టాలీవుడ్ చిత్రసీమ కోల్పోయిందని కలత చెందుతున్నారు సినీ ప్రముఖులు.

    Recommended Video

    #RIPVenuMadhav : Comedian Venu Madhav Is No More
    ఎస్వీ కృష్ణారెడ్డి ద్వారానే పరిచయం

    ఎస్వీ కృష్ణారెడ్డి ద్వారానే పరిచయం

    వేణుమాధవ్ సినీ ప్రయాణం దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తోనే మొదలైంది. 1996 సంవత్సరంలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'సంప్రదాయం' సినిమాతో వెండితెరపై కాలుమోపారు వేణు మాధవ్. అనతి కాలంలోనే స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ఆయన అందరు అగ్ర హీరోలతో తెర పంచుకున్నారు.

    మొదటిసారి అక్కడే చూశా..

    మొదటిసారి అక్కడే చూశా..

    వేణుమాధవ్ మృతి పట్ల స్పందించిన ఎస్వీ కృష్ణారెడ్డి.. అతన్ని తొలిసారి ఓ థియేటర్ లో చూశానని చెప్పారు. వేణుమాధవ్ చాలా టాలెంట్ ఉన్న కమెడియన్ అని. పని పట్ల ఆయనకు ఏకాగ్రత ఎక్కువగా ఉండేదని చెప్పారు. నిన్న రాత్రే ఆయన్ను హాస్పిటల్ లో చూశానని ఇంతలోనే ఆయన మృతి చెందడం బాధగా ఉందని, ఓ మంచి కమెడియన్‌ని మిస్ అయ్యామని అన్నారు.

    మొదటి నుంచి చివరి వరకు

    మొదటి నుంచి చివరి వరకు

    తన సినీ ప్రయాణంలో మొదటి నుంచి చివరి వరకు వేణు మాధవ్ చాలా యాక్టీవ్ గా పని చేశారని అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. చివరిసారిగా అతన్ని ఓ ఫంక్షన్ లో కలిశానని అన్నారు. తన ఆరోగ్యం బాగా లేదని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. వేణు మాధవ్ లాంటి టాలెంటెడ్ వ్యక్తి మరణం టాలీవుడ్ చిత్రసీమకు తీరని లోటు అని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

    వేణు మాధవ్ సినిమాలు

    వేణు మాధవ్ సినిమాలు

    ప్రియమైన నీకు, ఆది, సొంతం, తొలిప్రేమ, సింహాద్రి, సై, ఛత్రపతి, దిల్, సాంబ, వెంకీ, తమ్ముడు, పోకిరి, ఖతర్నాక్, యోగి, దేశముదురు, సంక్రాంతి, మాస్, అతనొక్కడే తదితర సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల మన్ననలు పొందారు వేణు మాధవ్. పలు టీవీ షోల్లో హోస్ట్ గా కూడా చేశారు.

    English summary
    Comedian Venu Madhav passed away. During critical helth condition he is under going treatment for Kidney failure and Liver related issues in Yashoda Hospital. Tollywood actors says their condolence to venu madhav death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X