Venu Madhav కష్టాలు నాకు తెలుసు.. ఆర్ధిక సాయం.. మంత్రి తలసాని శ్రీనివాస్ సంతాపం

ప్రముఖ నటుడు, టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మరణంతో యావత్ తెలుగు ప్రేక్షకులు విషాదంలో మునిగారు. ఆయన మరణవార్త తెలిసి సినీ, రాజకీయ వర్గాల్లోని ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. తాజాగా వేణుమాధవ్ మృతి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన

తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన

గత కొద్దికాలంగా కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. వేణు మాధవ్ మరణ వార్త తెలియగానే ఉటాహుటిన యశోద ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అక్కడ మీడియాతో మాట్లాడిన తలసాని.. వేణుమాధవ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందారు.

Recommended Video

#RIPVenuMadhav : Comedian Venu Madhav Is No More
చిన్నతనం నుంచే పరిచయం

చిన్నతనం నుంచే పరిచయం

ఇంత చిన్న వయసులో వేణు మాధవ్ మరణించడం బాధాకరమని అన్నారు తలసాని. వేణు మాధవ్ తనకు చిన్నతనం నుంచే పరిచయమని, ఆయన ఎక్కుడుంటే అక్కడ నవ్వులే అని అన్నారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారని అన్నారు. సినీ ఇండస్ట్రీలో అందరితో సరదాగా ఉండే వ్యక్తి వేణు మాధవ్ అని అన్నారు. కేవలం టాలెంట్ నమ్ముకొని స్వయం కృషితో ఆయన ఎదిగారని చెప్పారు తలసాని.

వేణు మాధవ్ కష్టాలు నాకు తెలుసు

వేణు మాధవ్ కష్టాలు నాకు తెలుసు

మొదటి నుంచి వేణు మాధవ్ పడిన కష్టాలు తనకు తెలుసని తలసాని చెప్పారు. ఇద్దరు పిల్లలను చూస్తూ వేణు మాధవ్ సంతోష పడేవారని, ఆయన మృతి బాధాకరమని అన్నారు. భగవంతుడు వేణు మాధవ్ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ మేరకు వేణు మాధవ్ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే వేణు మాధవ్ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్.

సినీరంగంలోకి వేణు మాధవ్

సినీరంగంలోకి వేణు మాధవ్

1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘సంప్రదాయం' చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు వేణు మాధవ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ' సినిమాతో మంచి బ్రేక్ తెచ్చుకొని తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్‌గా రాణించారు. అదే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హంగామా' సినిమాతో హీరో కూడా అయ్యారు వేణు మాధవ్.

 వేణు మాధవ్ సినీ జర్నీ.. రాజకీయాల్లోనూ

వేణు మాధవ్ సినీ జర్నీ.. రాజకీయాల్లోనూ

ఆది, సొంతం, ప్రియమైన నీకు, తొలిప్రేమ, సింహాద్రి, సై, ఛత్రపతి, దిల్, సాంబ, వెంకీ, తమ్ముడు, పోకిరి, ఖతర్నాక్, యోగి, దేశముదురు, సంక్రాంతి, మాస్, అతనొక్కడే తదితర సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల మన్ననలు పొందారు వేణు మాధవ్. పలు టీవీ షోల్లో హోస్ట్‌గా కూడా చేశారు. రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చూపించారు వేణు మాధవ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X