Vijay Antony: కుమార్తె సూసైడ్.. ఆత్మహత్యల గురించి విజయ్ ఆంటోనీ ఏమన్నారంటే?

మ్యూజిక్ డైరెక్టర్, నటుడు విజయ్ ఆంటోనీ తెలుగు వారికి సైతం సుపరిచితమే. అయితే ఆయన కుమార్తె లారా ఈరోజు ఆత్మహత్యకు పాల్పడటం హాట్ టాపిక్ గా మారింది. 12వ తరగతి చదువుతున్న లారా... తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయింది. అయితే గతంలో విజయ్ ఆంటోనీ ఆత్మహత్యల గురించి కీలక కామెంట్స్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే....

నటుడు, మ్యూజిట్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ... తెలుగు ప్రేక్షకులకు బిచ్చగాడు సినిమాతో దగ్గరయ్యాడు. ఇక ఈ సినిమాకు ముందే ఆయన సలీమ్, డాక్టర్ సలీమ్ వంటి సినిమాల్లో నటించాడు. అయితే బిచ్చగాడు సినిమా మాత్రం తెలుగులో సైతం సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగానే కాదు.. అందరికీ కనెక్ట్ అయింది. ఇక ఇటీవల బిచ్చగాడు 2, హత్య సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు.

Actor Vijay Antony Daughter Committed Suicide and He say about suicides Video Viral

విజయ్ అంటోనీ ఇంట్లో నేడు విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె లారా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చెన్నైలోని డీడీకే రోడ్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు విజయ్ ఆంటోనీ. అతని కూతురు లారా. ఆమె 12వ తరగతి చదువుతుంది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. షాక్‌కు గురైన తల్లిదండ్రులు వెంటనే ఆమెను రక్షించి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొన్ని రోజులుగా విజయ్ ఆంటోనీ ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. విజయ్ ఆంటోనీ గతంలో ఆత్మహత్యల గురించి మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. అందులో ఆయన ఆత్మహత్యల గురించి కీలక కామెంట్స్ చేశారు.

Actor Vijay Antony Daughter Committed Suicide and He say about suicides Video Viral

గతంలో విజయ్ ఆంటోనీ ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ... అసలు ఆత్మహత్యలకు కారణం ఏంటో వివరించాడు. ఈ ఆత్మహత్యలకు పాఠశాలలు, తల్లిదండ్రులే కారణమంటూ చెప్పుకువచ్చాడు. పిల్లలపై తీవ్ర ఒత్తిడి తీసుకురావద్దని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నెట్టింట ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Actor Vijay Antony Daughter Committed Suicide and He say about suicides Video Viral

విజయ్ ఆంటోనీ అంత గొప్పగా ఆలోచిస్తే... మరి వారి కుమార్తే ఒత్తిడి కారణంగా ఎలా సుసైడ్ చేసుకుందని అంటున్నారు. పేరెంట్స్ పెట్టిన ఒత్తిడా.. లేదంటే పాఠశాలల్లో చదువు విషయంలో కలిగిన ఒత్తిడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ ఆంటోనీ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తెకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X