twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇళయ దళపతి విజయ్ ‘అదిరింది’ ఫస్ట్‌లుక్‌ సూపర్!

    కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అదిరింది అనే టైటిల్ విజయ్‌కు సరిగ్గా సరిపోయిందనే కామెంట్స్ వస్తున

    By Rajababu
    |

    కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అదిరింది అనే టైటిల్ విజయ్‌కు సరిగ్గా సరిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. విజయ్ అభిమానులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులు, సినీ వర్గాలు అదిరింది టైటిల్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెన్నాండల్ బ్యానర్లో నిర్మిస్తున్న వందో చిత్రం కావడం విశేషం. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ స్వరాలందిస్తున్నారు. తెన్నాండల్ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి తెలుగులో అదిరింది చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

    శరత్ మరార్ అసోసియేట్ కావడం..

    శరత్ మరార్ అసోసియేట్ కావడం..

    మురళీ రామస్వామి మాట్లాడుతూ... నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ అధినేత శరత్ మరార్ తో కలిసి తెన్నాండల్ స్టూడియోస్ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందించనున్నాం. శరత్ మరార్ ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి భారీ చిత్రాలు నిర్మించిన శరత్ మరార్ గారికి

    టీవీ ఇండస్ట్రీలో కూడా చాలా మంచి పేరుంది. ఆయనతో అసోసియేట్ కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అని అన్నారు.

    గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం..

    గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం..

    శరత్ మరార్ మాట్లాడుతూ... విజయ్ 61వ చిత్రం, తెన్నాండల్ స్టూడియోస్ వందో చిత్రం అదిరింది సినిమాతో అసోసియేట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాం. విజయ్ కు తెన్నాండల్ స్టూడియోస్ కు, డిస్ట్రిబ్యూటర్స్ కు ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారు.

    విజయేంద్రప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లే

    విజయేంద్రప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లే

    ప్రపంచం గర్వించదగ్గ చిత్రం బాహుబలి, సల్మాన్ ఖాన్ కు భారీ హిట్ అందించిన భజరంగీ భాయిజాన్ వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ అదిరింది చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ చిత్రంలో విజయ్ తో పాటు ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    యూరప్ అందమైన లొకేషన్లలో

    యూరప్ అందమైన లొకేషన్లలో

    ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు యూరప్ లోని అందమైన లొకేషన్స్ లో ఈచిత్ర షూటింగ్ జరిగింది. ఆగస్ట్ లో ఈ చిత్ర ఆడియోను రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ మొదలు పెట్టారు. అక్టోబర్ లో ఈచిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    తెరవెనుక.. తెరముందు..

    తెరవెనుక.. తెరముందు..

    నటీనటులు: విజయ్, ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్. సాంకేతిక నిపుణులు: సంగీతం - ఎ.ఆర్.రెహమాన్, సాహిత్యం - వివేక్సినిమాటోగ్రాఫర్ - జి.కె.విష్ణు, ఎడిటర్ - రుబన్, యాక్షన్ - అనల్ అరసు, కొరియోగ్రఫి - శోభి, స్టోరీ - విజయేంద్రప్రసాద్, స్క్రీన్ ప్లే - విజయేంద్ర ప్రసాద్, రమణ గిరివాసన్

    English summary
    Ilayathalapathy Vijay's grand 61st film 'Mersal' is the talk of the tinsel town ever since the first look posters were unveiled on the eve of Vijay's birthday. The Telugu version of 'Mersal' has been titled as 'Adirindhi'. Since the veteran writer Vijayendra Prasad has worked in the script department of this film, Adirindhi' is expected to take a huge opening in Andhra Pradesh and Telangana where Vijay's fan base is also getting expanded.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X