విక్రమ్‌ గుండెపోటు వార్తలపై ధృవ్‌ ఫైర్‌.. అసలు విషయం ఇదేనంటూ ఎమోషనల్!

హీరో విక్రమ్‌ గుండెపోటుతో శుక్రవారం మధ్యాహ్నం కావేరి ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో విక్రమ్‌ నిజంగానే చేరడంతో ఆయన ఆరోగ్యంపై అభిమానులు సహా ప్రేక్షకులు కూడా ఆందోళన చెందారు. సడెన్‌గా విక్రమ్‌ ఇలా ఆసుపత్రి పాలు కావడం, అదికూడా గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారనే వార్త టెన్షన్ పెట్టగా ఈ విషయం మీద విక్రమ్ కుమారుడు ధృవ్ ఘాటుగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

చెస్ట్ లో పెయిన్‌

చెస్ట్ లో పెయిన్‌


గుండెపోటుతో తమ ఆసుపత్రికి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్న మేర తాజాగా కావేరి ఆసుపత్రి వైద్య బృందం విక్రమ్‌ హెల్త్ పై మెడికల్‌ బుల్లెటిన్‌ విడుదల చేసింది. విక్రమ్‌ చెస్ట్ పెయిన్‌తో ఆసుపత్రిలో చేరారని, అనుభవం ఉన్న ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందించారని వెల్లడించారు. ప్రస్తుతం విక్రమ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయనకు జస్ట్ చెస్ట్ లో పెయిన్‌ వచ్చింది కానీ అది హార్ట్ ఎటాక్‌ లేదా కార్డియాక్ అరెస్ట్ కాదని అన్నారు.

 ఎంతో బాధపడ్డామని

ఎంతో బాధపడ్డామని


విక్రమ్‌ ఆరోగ్యం బాగుంది. త్వరలోనే ఆయన్ని డిశ్చార్జి చేస్తామని విడుదల చేసిన బుల్లెటిన్‌ లో పేర్కొన్నారు. ఇక చియాన్ విక్రమ్ ఆరోగ్యం పై విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణన్ క్లారిటీ ఇచ్చారు. చియాన్ విక్రమ్‌కు ఛాతీలో తేలికపాటి అసౌకర్యం కలిగిందని, దాని కోసం చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు. గుండెపోటు వచ్చింది అని తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతోంది, ఈ పుకార్లు విని మేము ఎంతో బాధపడ్డామని ఆయన అన్నారు.

పుకార్లకు స్వస్తి

పుకార్లకు స్వస్తి


ఈ సమయంలో ఆయనకు ఆ కుటుంబానికి ప్రైవసీ అవసరమన్న ఆయన తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరారు. మన ప్రియమైన విక్రమ్ ఇప్పుడు బాగానే ఉన్నారని, ఈ రోజే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ ప్రకటన చియాన్ ఆరోగ్యం పై స్పష్టత నిస్తుందని తప్పుడు పుకార్లకు స్వస్తి చెపుతారని ఆశిస్తున్నామని అంటూ ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

పర్సనల్ లైఫ్‌

పర్సనల్ లైఫ్‌


మరో పక్క తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించి వస్తోన్న వార్తలపై ఆయన తనయుడు, యంగ్‌ హీరో ధృవ విక్రమ్‌ ఘాటుగా స్పందించారు. గుండెపోటు అంటూ వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఆయన అలా ప్రచారం చేస్తున్న వారి మీద ఫైర్‌ అయ్యారు. తన తండ్రి ఆరోగ్యం గురించి రూమర్స్ ని స్ప్రెడ్‌ చేయోద్దని, తమ పర్సనల్ లైఫ్‌కి ఇబ్బంది కలిగించవద్దని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కి, శ్రేయోభిలాషులకు ఆయన ఒక నోట్‌ని విడుదల చేశారు విక్రమ్ ధృవ్.

డిశ్చార్జ్ అయ్యారు

డిశ్చార్జ్ అయ్యారు


నాన్న చిన్నపాటి చెస్ట్ పెయిన్‌తో ఆసుపత్రి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారని, ఆయనకు గుండెపోటు వచ్చిందనేది పూర్తిగా తప్పుడు ప్రచారమని అన్నారు. ఇలాంటి రూమర్స్ వింటే చాలా బాధగా ఉంది. ఈ సందర్భంగా నాన్నకి, తమ ఫ్యామిలీకి ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్న ఆయన నాన్న ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు, ఈ నోట్‌ రూమర్స్ నకి సంబంధించి క్లారిటీ ఇస్తుందని నమ్ముతున్నా అంటూ ఆయన వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X