కారుతో హీరో విక్రమ్ కుమారుడి వీరంగం... ముగ్గురికి తీవ్ర గాయాలు, కేసు నమోదు (ఫోటోస్)
Recommended Video

ప్రముఖ సౌత్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ తన కారుతో వీరంగం సృష్టించాడు. మితిమీరిన వేగంతో రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్‌లో అతడితో కారుతో పాటు మూడు ఆటో పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

లగ్జరీ కారులో స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ
ఆదివారం తెల్లవారు ఝామున ధృవ్ తన లగ్జరీ కారులో తన ముగ్గురు స్నేహితులతో కలిసి ప్రయాణం చేస్తుండగా తైనంపేట్ పోలీస్ కమీషనర్ ఇంటి సమీంలోకి వచ్చిన తర్వాత అదుపు తప్పింది. వేగంగా వెళుతూ అక్కడ రోడ్డు పక్కన నిలిచిన ఆటోరిక్షాలను ఢీకొట్టింది.

ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంలో ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్ గాయాలపాలయ్యాడు. అతడితో పాటు ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ కాలుకు ఫ్యాక్చర్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు
విషయం తెలుసుకున్న పాండీ బజార్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ధృవ్ కారు స్వాధీనం చేసుకోవడంతో పాటు అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై దర్యాప్తు జరుపుతున్నారు.

అర్జున్ రెడ్డి రీమేక్ ద్వారా
ధృవ్ త్వరలో ‘వర్మ' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి'కి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.


Click it and Unblock the Notifications











