మొదలైన విశాల్ పెళ్లి ఏర్పాట్లు..పెళ్లి కూతురు ఆ హీరోయినేనా..!

Recommended Video

Kollywood Bachelor Revealed His Wedding Plans

ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు పందెం కోడి విశాల్ కు పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి. విశాల్ నటుడిగా కొనసాగుతూనే, తమిళ రాజకీయాలపై తరచుగా స్పదిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తన వివాహం జనవరిలో జరగబోతోందని విశాల్ స్వయంగా ప్రకటించాడు. దీనితో అతడి వివాహం గురించి ఉహాగానాలు మొదలై పోయాయి. పెళ్లి కూతురు ఎవరంటూ తెగ ఆరా తీస్తున్నారు. విశాల్ మాత్రం తనకు కాబోయే భాగస్వామి ఎవరో చెప్పా కుండా సస్పెన్స్ లోకి నెట్టేశాడు.

తెలుగువాడిగా తమిళనాట

తెలుగువాడిగా తమిళనాట

స్వతహాగా విశాల్ కుటుంబం తెలుగువారు. కానీ తమిళనాడులో సెటిల్ అయ్యారు. ఈ పొగరైన పందెం కోడి దేనికైనా సై అనే రకం. అందుకే తమిళనాట విశాల్ చక్రం తిప్పుతున్నాడు. నడిగర్ సంఘం ఎన్నికల్లో సైతం విశాల్ కీలక పాత్ర పోషించాడు.

 ఆరంభంలో విజయాలు

ఆరంభంలో విజయాలు

కెరీర్ ఆరంభంలో విశాల్ కు మంచి విజయాలు దక్కాయి. పందెం కోడి చిత్రంతో విశాల్ దక్షణాది ప్రేక్షకులనిఆకర్షించాడు. ఆ తరువాత వచ్చిన భరణి, పొగరు వంటి చిత్రాలు కూడా విశాల్ కు మంచి విజయాన్ని అందించాయి.

పరాజయాలు ఎదురైనా అదే సత్తా

పరాజయాలు ఎదురైనా అదే సత్తా

విశాల్ కు పరాజయాలు ఎదురైనప్పటికి అదే సత్తాతో సినిమాలలో రాణిస్తున్నాడు. విభిన్న చిత్రాలతో ముందుకు వస్తున్నాడు. విశాల్ తాజాగా నటిస్తున్న చిత్రం అభిమన్యుడు. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది.

 రాజకీయాలలోనూ ఎంట్రీ

రాజకీయాలలోనూ ఎంట్రీ

విశాల్ కు రాజకీయాలపై కూడా ఆసక్తి ఉంది. ఇటీవల ముగిసిన ఆర్కే నగర్ బై ఎలక్షన్ లో పోటీ చేయడానికి విశాల్ ప్రయత్నించినా సంగతి తెలిసిందే. కానీ విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. భవిష్యత్తులో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని విశాల్ ప్రకటించాడు.

ఆ హీరోయిన్ తో ప్రేమాయణం

ఆ హీరోయిన్ తో ప్రేమాయణం

ఆ మద్యన విశాల్ ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో, ఆఖరికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం వార్తలు తెగ హల్ చల్ చేసాయి. ప్రముఖ సినియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ ని విశాల్ వివాహం చేసుకోబోతున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

విశాల్ పెళ్లి ప్రకటన

విశాల్ పెళ్లి ప్రకటన

తాజగా విశాల్ తాను పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించాడు. త్వరలోనే వివాహం జరగబోతోందని ప్రకటించిన విశాల్ పెళ్లి కుమార్తె ఎవరో చెప్పలేదు. దీనితో మరో మరు పుకార్లు జోరందుకున్నాయి. విశాల్ వివాహమాడబోయేది వరలక్ష్మినే అంటూ ప్రచారం మొదలైంది.

 పెళ్లి ఎప్పుడు, ఎక్కడ

పెళ్లి ఎప్పుడు, ఎక్కడ

విశాల్ తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విశాల్ నేతృత్యంలో నడిగర్ సంఘం భవన నిర్మాణం జరుగుతోంది. డిసెంబర్ నాటికీ ఈ భవనం పూర్తి కానుంది. తన వివాహం జనవరిలో అక్కడే జరగబోతోందని విశాల్ ప్రకటించాడు. స్వయంగా డబ్బులు చెల్లించి ఆ భవనంలో కల్యాణ మండపాన్ని బుక్ చేసుకుంటానని విశాల్ ప్రకటించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X