twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి వారికి మరణశిక్ష విధించాలి.. లేకపోతే భయం ఉండదు.. విశాల్

    By Rajababu
    |

    దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న నటుల్లో విశాల్ ఒకరు. సినిమాలే కాదు ఆయనకు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. ప్రజా సమస్యలపై తీవ్రంగా స్పందిస్తుంటారు. తమిళనాడులో ఉప ఎన్నికల సందర్భంగా అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఏదో కొన్ని కారణాల వల్ల ఆయన నామినేషన్ తిరస్కరించారనేది తెలిసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విశాల్ ప్రస్తుతం ఇరంబు థిరై చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగులో అభిమన్యుడు పేరుతో రిలీజ్ కానున్నది. ఈ చిత్రం విశాల్ కెరీర్‌లోనే అత్యంత వివాదాస్పద చిత్రమని ఇటీవల అన్నాడు. ఈ చిత్రం విడుదల నేపథ్యంలో చాలా విషయాలు పంచుకొన్నారు.

    Recommended Video

    Abhimanyudu Team Funny interview
     జూన్1న అభిమన్యుడు రిలీజ్

    జూన్1న అభిమన్యుడు రిలీజ్

    అభిమన్యుడు చిత్రం జూన్ 1న రిలీజ్ కానున్నది. తమిళంలో ఇరంబు తిరై అనే పేరుతో మే 11 తేదీన రిలీజైంది. అన్నివర్గాల నుంచి మంచి హిట్ టాక్ వచ్చింది. నా కెరీర్‌లోనే అతిపెద్ద కమర్షియల్ సక్సెస్. ఈ చిత్రానికి మిత్రన్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు ఇది తొలి చిత్రం.

     హ్యాకర్‌గా యాక్షన్ కింగ్ అర్జున్

    హ్యాకర్‌గా యాక్షన్ కింగ్ అర్జున్

    బ్యాంక్, ఏటీఎం ఫ్రాడ్ నేపథ్యంగా అభిమన్యుడు తెరకెక్కింది. డిజిటల్ ఇండియా, ఆధార్ కార్డు వల్ల జరిగే ఏదైనా ప్రయోజనం ఉందా అనే కోణంలో ఈ సినిమాను రూపొందించాం. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ హ్యాకర్‌గా నటించారు. ఆయన పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి.

    అర్జున్‌తో ఫైట్ హైలెట్

    అర్జున్‌తో ఫైట్ హైలెట్

    అర్జున్ గారితో నా కెరీర్‌ ప్రారంభమైంది. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఎవరైతే నన్ను హీరోగా పరిచయం చేశారో.. ఆయన నా సినిమాలో విలన్‌గా నటించారు. క్లైమాక్స్‌లో ఆయనతో చేసే ఫైట్ హైలెట్‌గా ఉంటుంది.

    ధైర్యం ఉండాలి

    ధైర్యం ఉండాలి

    నూతన దర్శకుడు మిత్రన్ కథను నేను, సమంత అక్కినేని, అర్జున్ అందరూ నమ్మారు. మూడేళ్ల క్రితం నాకు ఈ కథ చెప్పారు. సినిమాలో ఆయన రాసిన డైలాగ్స్‌ చెప్పడానికి ధైర్యం ఉండాలి. సైన్యంలో పనిచేసే సైనికులకు కనీసం ఆధార్ కార్డు లేదనే విషయం నాకు చాలా దిగ్బ్రాంతికి గురిచేసింది. రైతులకు రుణాలు ఇవ్వకపోవడం అనేది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి అంశాలు సినిమాలో కనిపిస్తాయి.

    మిత్రన్‌లో ఓ ఫైర్ ఉంది

    మిత్రన్‌లో ఓ ఫైర్ ఉంది

    కొత్త డైరెక్టర్‌కు ఓ ఫైర్ ఉంటుంది. ఏదో కొత్త విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. అదే నాకు బాగా నచ్చుతుంది. అభిమన్యుడు చిత్రం విషయంలో మిత్రన్‌లో అదే కనిపించింది.

     బ్యాంక్ ఫ్రాడ్స్‌తో మోసం

    బ్యాంక్ ఫ్రాడ్స్‌తో మోసం

    ఆధార్ కార్డును మన బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయడం వల్ల అనేక సమస్యలు ఉంటాయి. ఫోన్‌కు కూడా ఆధార్ కనెక్ట్ చేస్తారు. మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ నుంచి 10 రూపాయలు తగ్గిపోతాయి. ఇలాంటి సమస్యలను చాలా మంది ఎదుర్కొంటున్నారు. బ్యాంక్, ఏటీఎం ఫ్రాడ్స్‌తో చాలా మంది మోసపోతున్నారు.

     పిల్లలపై లైంగిక దాడి

    పిల్లలపై లైంగిక దాడి

    రాజకీయాల ప్రయోజనాల కోసం సినిమాలు తీయడం లేదు. నా పొలిటిక్ యాంబిషన్ కోసం సినిమాను ఉపయోగించుకొను. సామాజిక అంశాలపై ప్రేక్షకుల్లో చైతన్యం కల్పించడానికి ప్రయత్నిస్తున్నాను. పిల్లలపై లైంగిక దాడులు చేసే వారికి మరణశిక్ష విధించాలే అనేది నా అభిప్రాయం. బాలలపై లైంగిక దాడులకు కఠినమైన శిక్ష ఉండాలి. లేకపోతే నేరస్తుల్లో భయం ఉండదు అని విశాల్ అన్నారు.

    English summary
    Vishal's latest movie is Abhimanyudu. This movie is dubbing movie of Irumbu Thirai. Samantha and Vishal are lead pair. This movie is going to release on June 1st. In occassion, Vishal speaks to Telugu filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X