twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్‌‌కు ఇండస్ట్రీకి సంబంధం లేదా? వివాదాస్పద వ్యాఖ్యలపై విష్ణు మంచు స్పందిస్తూ..

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ రెండుగా చీలిపోయింది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. వరుసగా మీడియా సమావేశాలు పెట్టి దారుణంగా విమర్శలు చేసుకోవడం అటు సినిమా, రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది. అయితే పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఘాటుగా స్పందించడం మరో వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఏమని స్పందించారంటే..

    నా సోదరుడిని ఎందుకు లాగడం అంటూ నాగబాబు

    నా సోదరుడిని ఎందుకు లాగడం అంటూ నాగబాబు


    ఇటీవల మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలపై నాగబాబు తప్పుపట్టారు. ప్రకాశ్ రాజ్‌కు ఛాలెంజ్ చేస్తే పర్వాలేదు. కానీ నా సోదరుడు పవన్ కల్యాణ్‌ను లాగడం సరికాదు. ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి నీవు పవన్ కల్యాణ్ వైపు ఉంటావా? లేక ఇండస్ట్రీ వైపు ఉంటావా అంటూ మంచు విష్ణు ఎలా కామెంట్ చేస్తాడు అని నాగబాబు ప్రశ్నించాడు.

    పవన్ కల్యాణ్ తెలుగువాడు కాదా?

    పవన్ కల్యాణ్ తెలుగువాడు కాదా?

    మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్ అంటే తెలుగు వాడు కాదని మంచు విష్ణు ఆరోపించాడు. అయితే పవన్ కల్యాణ్ తెలుగువాడు కాదా? లేదా తెలుగు ఇండస్ట్రీకి కల్యాణ్ బాబు చెందనివాడు కాదా? ప్రకాశ్ రాజ్‌ను ఎటువైపు ఉంటాడని ఎలా ప్రశ్నిస్తాడు? ఏం ఆలోచిస్తారో.. వాళ్లకు ఏమి ఫీడ్ బ్యాక్ ఇస్తారో అర్ధం కావడం లేదు. పవన్ కల్యాణ్ కూడా అవుట్ సైడరా? అని నాగబాబు ప్రశ్నించారు.

    పవన్ వైపా? ఇండస్ట్రీ వైపా అంటూ విష్ణు మంచు

    పవన్ వైపా? ఇండస్ట్రీ వైపా అంటూ విష్ణు మంచు

    అయితే పవన్ కల్యాణ్‌ వైపు ఉంటావా? ఇండస్ట్రీ వైపు ఉంటావా? అని మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. పవన్ కల్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్ల అంతా విష్ణు సినిమా మొత్తం బడ్జెట్ ఉండదు. అలాంటి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసే అర్హత విష్ణుకు లేదు అంటూ ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు.

    నాగబాబు ప్రశ్నలకు మంచు విష్ణు సమాధానం

    నాగబాబు ప్రశ్నలకు మంచు విష్ణు సమాధానం


    నాగబాబు ప్రశ్నలకు విష్ణు మంచు సమాధానం ఇస్తూ.. నేను ఎఫ్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పవన్ కల్యాణ్ వేరు చేయలేదు. టాలీవుడ్‌లో ఆయన బిగ్గెస్ట్ స్టార్. అయితే ఇదే ప్రశ్న నేను చాంబర్ సభ్యులకు వేస్తున్నాను. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఫిలిం ఛాంబర్ ఎందుకు పట్టించుకోలేదు. నా తండ్రిపై పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో చేసిన కామెంట్లపై నేను స్టాండ్ తీసుకొన్నాను. పవన్ కల్యాణ్ చేసిన ప్రశ్నలకు అక్టోబర్ 10వ తేదీన పవన్ కల్యాణ్ ప్రశ్నలకు నాన్న మోహన్‌బాబు సమాధానం ఇస్తారు అని విష్ణు మంచు అన్నారు.

    అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు

    అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు

    ఇలాంటి వివాదాల మధ్య మా ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీన జరుగనున్నాయి. మొత్తం 900 మందికిపైగా సభ్యులు ఉన్న అసోసియేషన్‌ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇరు ప్యానెల్స్ విజయంపై ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికకు కొద్ది గంటల ముందు సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొంటున్నారు. అయితే ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకొంటాయో వేచి చూడాల్సిందే.

    English summary
    MAA Elections on October 10th: Actor Vishnu Manchu clarity about comments on Pawan Kalyan after Nagababu opposes comments on Kalyan Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X