Vishnu Vishal, Jwala Gutta Marriage: డేటింగ్‌కు గుడ్‌బై.. వేదమంత్రాల మధ్య ఒక్కటైన జ్వాలా, విష్ణు
కొద్దినెలలుగా ఆఫైర్‌ను కొనసాగిస్తున్న తమిళ హీరో విష్ణు విశాల్, బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా ఒక్కటయ్యారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల మధ్య వివాహం చేసుకొన్నారు. వివాహం జరిగిన కొద్ది సేపట్లోనే నూతన దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరి సెలబ్రిటీల వివాహం గురించిన ముచ్చట్లు మరింతగా మీకోసం..
యువ హీరోయిన్ గ్లామర్ ఫోటోషూట్.. లేత సొగసులను అలా దాచేస్తూ..

వివాహంపై అధికారికంగా
గత కొద్దికాలంగా హీరో విష్ణు విశాల్, జ్వాలా గుత్తా వివాహం చేసుకొంటారనే వార్తలకు బలం కలిగించేలా వారి నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన ప్రకటనను వెల్లడించారు. త్వరలోనే వివాహం చేసుకొంటామని చెబుతూ పెళ్లిపై అధికారికంగా స్పందించారు. కోవిడ్ నిబంధనలు, పరిస్థితుల కారణంగా ఎక్కువగా అతిథులును ఆహ్వానించలేకపోతున్నాం అని జ్వాలా గుత్తా, విష్ణు వెల్లడించారు.
బొడ్డు చూపిస్తూ సెగలు రేపిన పాయల్ రాజ్‌పుత్.. మరో రేంజ్‌లో సెక్స్ అప్పీల్

కుటుంబ సభ్యుల సమక్షంలో
హైదరాబాద్‌లో జరిగిన జ్వాలా, విష్ణు వివాహ వేడుకలకు అతి తక్కువ మంది హాజరయ్యారు. కుటుంబ సంప్రదాయాలను పాటిస్తూ జ్వాలా మెడలో విష్ణు విశాల్ మూడుమూళ్లు వేశారు. ఈ సందర్భంగా వారిద్దరికి స్నేహితులు, సన్నిహితులు శుభాకాంక్షలు అందజేశారు.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా హీరోయిన్ ఫోటోషూట్ వైరల్.. సరికొత్త అందాలతో

హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్‌గా
వివాహ వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 21వ తేదీన జ్వాలా ఇంటిలో మెహందీ, హల్దీ ఫంక్షన్ జరిగింది. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆనందోత్సవాల మధ్య కుటుంబ సభ్యులు జ్వాలా ఒంటికి పసుపు పట్టించి మంగళస్నానం చేయించారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో సంతోషంగా జ్వాలా కనిపించింది.

ఆకట్టుకొన్న మెహందీ ఫోటోలు
జ్వాలా, విష్ణు విశాల్‌కు సంబంధించిన మెహందీ వేడుకలను కూడా ఘనంగా జరిపించారు. అతికొద్ది మంది స్నేహితులు హాజరుకాగా.. గానా భజానాతో వేదికను హోరెత్తించారు. సినిమా పాటలకు అనుగుణంగా డ్యాన్సులు వేసి హల్‌చల్ చేశారు. పెళ్లికి ముందు జరిగిన వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

జ్వాలా, విష్ణు వ్యకిగత జీవితం గురించి
జ్వాలా గుత్తా, విష్ణు విశాల్ ఇద్దరికి ఇది రెండో వివాహం. గతంలో తన చిన్ననాటి స్నేహితురాలు రజనీ నటరాజన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. వారిద్దరికి ఆర్య అనే కుమారుడు ఉన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరు 2018లో లీగల్‌గా విడాకులు తీసుకొన్నారు. ఇక జ్వాలా గుత్తా, బాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌ను లవ్ మ్యారేజ్ చేసుకొన్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత విశాల్ సోదరి పెళ్లిలో కలుసుకొన్న జ్వాలా, విశాల్ ఇద్దరు డేటింగ్ చేస్తూ వచ్చారు.


Click it and Unblock the Notifications











