Malli Pelli Twitter Review: 'మళ్లీ పెళ్లి'కి ఊహించని టాక్.. క్లైమాక్స్ మాత్రం అలా.. ఎలా ఉందంటే?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందారు వీకే నరేష్. సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ, మంచి టైమింగ్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన వ్యక్తిగత విషయాలు ఎక్కువగా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెగ వార్తల వచ్చాయి. అంతేకాకుండా పవిత్రను పెళ్లి చేసుకున్న వీడియో షేర్ చేయడం, అది మళ్లీ పెళ్లి (Malli Pelli)సినిమా కోసం చేసిన స్టంట్స్ అని తెలిసి అంతా షాక్ అయ్యారు. అలా ప్రమోషన్స్ లో జిమిక్కులు చేసిన మళ్లీ పెళ్లి మూవీ ఎట్టకేలకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాపై పబ్లిక్ ఎమంటున్నారనే వివరాల్లోకి వెళితే..

కిస్సింగ్ వీడియోతో: టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేష్ (VK Naresh), పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ మళ్లీ పెళ్లి (Malli Pelli). విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకనిర్మాత ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహించారు. పవిత్ర లోకేష్ తో కిస్సింగ్, పెళ్లి వీడియోలతో మొదలైన ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగాయి.

Malli Pelli Twitter Review

రెండు భాషల్లో: డిఫరెంట్ తరహాలో ప్రమోషన్స్ నిర్వహించి సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. అంతేకాకుండా ఈ సినిమా నుంచి వదిలి ట్రైలర్ మరింత ఆసక్తి పెంచేసింది. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమా నరేష్, పవిత్ర నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని ఆ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

ట్రైలర్ ద్వారా: నరేష్, పవిత్రల మధ్య ఉన్న రిలేషన్ ఎక్కడి నుంచి ఎలా మొదలైంది ఏంటీ అనే విషయాలు మళ్లీ పెళ్లిలో చూపించినట్లుగా తెలుస్తోంది. నరేష్, తన మూడో భార్య రమ్య రఘుపతికి మధ్య మనస్పర్థలు, నరేష్-పవిత్ర ఓ హోటల్ లో దొరకడం, అది మీడియాలో రావడం వంటి నిజ జీవితంలో జరిగిన అనేక సన్నివేశాలు ఇందులో ఉన్నట్లుగా ట్రైలర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.

Malli Pelli Twitter Review

వివిధ రకాలుగా: ఇక ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి కోర్టుకెక్కడం కూడా ఆసక్తి నెలకొంది. కానీ ఎట్టకేలకు మే 26న అంటే ఇవాళ సినిమా విడుదలైంది. ఈ మూవీ చూసిన ప్రేక్షకుల వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు బాగోలేదు అంటే మరికొందరు చాలా బాగుంది, అసలు ఊహించనంత గొప్పగా ఉందని చెబుతున్నారు.

ఫస్టాఫ్ అలా: "మళ్లీ పెళ్లి సినిమా యావరేజ్ కంటే తక్కువ అనిపించింది. కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. ఓవరాల్ గా అయితే సినిమా యావరేజ్ బిలో యావరేజ్ అనిపించింది" అని ఒక యూజర్ అన్నాడు. "నరేష్ న్యాయం చేయలేకపోయాడు. స్టోరీ కూడా అంతా బాలేదు. టైమ్ పాస్ కి అయితే చూడొచ్చు. ఫస్టాఫ్ మొత్తం ఒక ల్యాగ్ లా వెళ్లిపోతుంది. ఇంటర్వెల్ కు అరగంట, క్లైమాక్స్ మాత్రం బాగుంది" అని మరొకరు తెలిపారు.

Malli Pelli Twitter Review

పాన్ ఇండియా లెవెల్: "సినిమా ఒక మినీ సైజ్ హాలీవుడ్ మూవీ. ఒక్కొక్క సీన్ కు గూస్ బంప్స్ వస్తున్నాయి. నరేష్ చాలా ఫిట్ గా గ్లామరస్ గా కనిపించారు. కొత్త హీరోలా అనిపించాడు. హీరోయిన్ అయితే రచ్చ లేపింది" అని ఒకరు చెప్పుకొచ్చారు. "సినిమా అన్ ప్రిడిక్టెబుల్. ఎవరూ ఊహించనంత బాగుంటుంది. పాన్ ఇండియా లెవెల్ దాటేసింది" అని మరొకరు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X