డబ్బు కోసమే ఇదంతా.. డ్రైవర్ తో అఫైర్.. మూడో భార్యపై నరేష్ సంచలన ఆరోపణలు
నటుడు నరేష్ వ్యవహారం ఇప్పుడు తెలుగుతో పాటు కన్నడ మీడియా వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆయనకు నటి పవిత్ర లోకేష్ కు మధ్య ఏదో సంబంధం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మాజీ భార్య రమ్య రఘుపతి కన్నడ మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో నరేష్ కన్నడ మీడియా ఎదుట మాట్లాడుతూ పలు సంచలన విషయాలు పంచుకున్నారు. తన మాజీ భార్య గురించి ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

ముస్లిం డ్రైవర్ తో ఎఫైర్
తన మూడో భార్య రమ్య రఘుపతి తనకు ఎప్పుడు భార్య లాగా ప్రవర్తించలేదని నరేష్ పేర్కొన్నారు. ఆమె కేవలం నన్ను డబ్బు కోసమే వివాహం చేసుకుందని అన్నారు. ఇక ఇంట్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తే ఒక మేల్ క్యాబరే డాన్సర్ తీసుకొచ్చిందని అన్నారు. తన దగ్గర పనిచేసే ఒక ముస్లిం డ్రైవర్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుందని ఆ విషయం తెలిసి ప్రశ్నిస్తే చెత్త వివరణలు ఇచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నోటీసు పంపడంతో
ఇక పరిస్థితి చేయి దాటి పోతుంది అని తెలిసినా తన కొడుకు కస్టడీ విషయంలో క్లారిటీ లేకపోవడంతో తాను విడాకులకు అప్లై చేయలేదని కొద్ది రోజుల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీల ఫ్రాడ్ వ్యవహారాలలో తాను పది లక్షల రూపాయలు ఎదురు చెల్లించాల్సి వచ్చిందని ఈ నేపథ్యంలో ఇక ఆమెతో కష్టమేనని భావించి విడాకుల నోటీసు పంపడంతో కన్నడలో బ్లాక్మెయిల్ కి పాల్పడే ఒక మీడియా ఛానల్ తో కలిసి బ్లాక్ మెయిల్ కి దిగిందని ఆయన పేర్కొన్నారు.

బెంగళూరు కేంద్రంగా
ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకే ఆమె పవిత్ర లోకేష్ కు తనకు ఏదో సంబంధం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేస్తుందని ఆయన అన్నారు. డబ్బు కోసమే రమ్య బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టిందని పేర్కొన్న నరేష్ హైదరాబాద్లో కూడా గతంలో ఇలాగే చేసిందని ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా ఈ వ్యవహారం మొదలుపెట్టిందని అన్నారు. ఈ విషయం మీద అలెర్ట్ చేయడానికి తాను బెంగళూరు వచ్చానని అన్నారు.

అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చా
ఇప్పటి వరకు తాను 200 సినిమాలలో వంద మంది హీరోయిన్స్ కి పైగా కలిసి నటించానని అలాంటిది ఒకే ఒక్క మహిళ తాను చీట్ చేసాను అని చెప్పడం మీరు గమనించారా అంటూ ఆయన ప్రశ్నించారు. రమ్య రఘుపతి తన కుటుంబంలో ప్రవేశించి పెద్ద కుటుంబాన్ని నాశనం చేసిందని కృష్ణ వంటి పెద్దవారి దగ్గరకు వెళ్లి 50 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేసిందని ఆయన అన్నారు. తాను తట్టుకోలేక పదిలక్షలు ఇచ్చానని ఆ డబ్బు కట్టకపోతే జైలుకు వెళ్లాలి వస్తుందని అంటే అప్పటికప్పుడు ఆ డబ్బులు ఇచ్చానని అన్నారు.

వీడియో కూడా విడుదల
అయితే ఇప్పుడు డబ్బులు తీసుకుని నేనేదో మోసం చేశాను అన్నట్టు మాట్లాడుతుందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అంతేగాక పవిత్ర లోకేష్ గురించి కూడా ఆయన కొన్ని విషయాలు పంచుకున్నారు. ఆమె తన స్నేహితురాలని అంతకుమించి ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయం మీద నరేష్ తాజాగా ఒక వీడియో కూడా విడుదల చేశారు


Click it and Unblock the Notifications











