ఆమె కోసం నిరాహర దీక్ష చేస్తా.. దారుణంగా అన్యాయం అంటూ నరేష్ సంచలన వ్యాఖ్యలు
సినీ పరిశ్రమలో సుదీర్ఘకాలం నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న వారిలో సర్ వీకే నరేష్ ఒకరు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో 52 ఏళ్లు పూర్తి చేసుకొన్నారు. అంతేకాకుండా జనవరి 20వ తేదీ ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన తన జీవిత భాగస్వామి పవిత్రా లోకేష్‌తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తన తల్లి విజయ నిర్మల గారికి, తెలుగు ప్రముఖులకు జరుగుతున్న అన్యాయం గురించి గళమెత్తారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..
మా అమ్మ విజయనిర్మల అని కాదు. ఇండస్ట్రీలో చాలా మంది గొప్ప వాళ్లకు పద్మ అవార్డులు రాలేదు. పద్మ అవార్డుకు అర్హులైన వారిలో వరల్డ్‌లో మోస్డ్ డిజైరబుల్ పర్సన్ మా అమ్మ అని గొప్పగా చెప్పుకొంటాను. ఎందుకంటే ఆమె ఓ మహిళ డైరెక్టర్‌గా 46 సినిమాలకు దర్శకత్వం వహించారు. అయినా ఆమెకు పద్మ పురస్కారం రాకపోవడం చాలా బాధాకరం. కొంత బాధతో ఆగ్రహంతో చెబుతున్నాను. నా తల్లి బతికి ఉన్న సమయంలో ఆమెకు ఇష్టం లేకపోయినా ఢిల్లీ వరకు క్యాంపెయిన్ చేశాను. కానీ ఫలితం లేకపోయింది అని వీకే నరేష్ అన్నారు.

ఒక తెలుగు మహిళగా పద్మ అవార్డుకు అర్హత ఉందని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వయంగా రికమండేషన్ పంపించారు. కాబోతే అక్కడికి వెళ్లినప్పుడు.. కొన్ని అదృశ్య శక్తులు మాకు వ్యతిరేకంగా పనిచేశాయి. వారి గురించి, ఆ వివాదాస్పద అంశాల గురించి నేను మాట్లాడను. బీజేపీ వచ్చిన తర్వాత పద్మ అవార్డులను అర్హత ఇవ్వడంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో మరోసారి మా అమ్మకు పద్మ అవార్డు కోసం సిఫారసు చేస్తాను అని ఆయన తెలిపారు.
తెలుగు వారికి పద్మ అవార్డుల్లో అన్యాయం జరుగుతున్నది నిజమే. ఢిల్లీ లెవెల్స్ అవార్డులను ప్రభావితం చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అంతేందుకు ఎన్టీఆర్‌కు భారత రత్న రాలేదు. తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తికే గుర్తింపు లేదు. తెలుగు వారెందరికో ఈ అవార్డులు రాలేదు. ఎన్టీఆర్, విజయ నిర్మల లాంటి గొప్ప వాళ్లకు అవార్డులు రావాల్సిన అవసరం ఉంది. నేను ఇక నుంచి క్యాంపెయిన్ చేస్తాను అని నరేష్ అన్నారు.
తెలుగు వారికి అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే నిరాహరదీక్ష చేపట్టడానికైనా సిద్దం. విజయ నిర్మల గారి కోసం కాకపోయినా.. ఆమె కొడుకుగా కాకున్నా.. తెలుగు ఫిల్మ్ మేకర్‌గా ఎంత వరకు వెళ్లడానికైనా నెను రెడీ. తెలుగు వారికి గుర్తింపు తెచ్చేందుకు నేను కృష్టి చేస్తాను అని వీకే నరేష్ అన్నారు.
నిర్మాతగా మారాను. ఇక ముందు దర్శకుడిగా మారేందుకు ప్రయత్నిస్తాను. మా అమ్మ జీవితంలోని సంఘటనల ఆధారంగా బయోపిక్ తీస్తాను. అలాగే శ్రీవారికి ప్రేమలేఖ, చిత్రం భళారే విచిత్రం సినిమాలకు సీక్వెల్ తీయాలనేది నా కోరిక. వాటి కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. త్వరలోనే వాటిని పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తాను అని చెప్పారు.


Click it and Unblock the Notifications











