దళపతి విజయ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన అనిల్ రావిపూడి.. సీక్రెట్ బయటపెట్టిన కమెడియన్

Anil Ravipudi-Thalapathy Vijay: కోలీవుడ్‌ స్టార్‌ దళపతి విజయ్‌ ప్రస్తుతం విజయ్‌69అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే, మమితా బైజు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ మూవీలో బాబీ డియోల్‌ విలన్ రోల్ చేస్తున్నారు. కేవీఎన్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా భగవంత్‌ కేసరి మూవీకి రీమేక్‌ అనే రూమర్లు వినిపించాయి. కానీ, దీనిపై అధికారికంగా ప్రకటన రాలేదు. ఈ ప్రశ్ననే ఇటీవల అనిల్‌ రావిపూడికి ఎదురైంది. కానీ,అసలు విషయం చెప్పకుండా దాటేశారు. కానీ, తాజాగా దళపతి విజయ్, డైరెక్టర్ అనిల్ రావిపూడిక మధ్య అసలేం జరిగిందనే విషయాన్ని బయటపెట్టారు నటుడు వీటీవీ గణేష్‌. అనిల్ రావిపూడి సీక్రెట్ ను రీవిల్ చేశారు. అసలేం జరిగిందో మీరు కూడా ఓ లూక్కేయండి.

విక్టరీ వెంకటేష్ హీరో గా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఓ కుటుంబ కథలో క్రైమ్‌ కోణాన్ని ఆవిష్కరిస్తూ 'సంక్రాంతికి వస్తున్నాం' తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మూవీ యూనిట్ ప్రమోషన్స్ ల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.

Actor VTV Ganesh shocking comments that Anil Ravipudi Rejects Thalapathy Vijay Last film thalapathy 69

ఈ తరుణంలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ మ్యూజికల్‌ ఈవెంట్ ను ‌ శనివారం రాత్రి నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నటుడు వీటీవీ గణేష్‌ మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి, తమిళ దళపతి విజయ్ మధ్య జరిగిన విషయాన్ని బయటపెట్టారు. అనిల్‌ రావిపూడి గురించి మాట్లాడుతూ.. అనిల్ చాలా గొప్ప దర్శకుడనీ, భగవంత్‌ కేసరి మూవీ రీమేక్‌ విషయాన్ని వెల్లడించారు. విజయ్‌69.. భగవంత్‌ కేసరి రీమేక్‌ అని పేర్కొన్నారు. భగవంత్ కేసరి మూవీని విజయ్‌ ఐదు సార్లు చూశారనీ, ఆ మూవీని విజయ్ ఇష్టపడ్డారని తెలిపారు. అదే సమయంలో మరో షాకింగ్‌ విషయం బయటపెట్టారు.

రీమేక్‌ డైరెక్ట్ చేయాలని అనిల్‌ రావిపూడినే అడిగారనీ, ఆ మూవీకి డైరెక్షన్‌ చేయమని విజయ్ ఆఫర్‌ ఇచ్చారనీ, కానీ దళపతి విజయ్ ఆఫర్ ను నో చెప్పినట్టు వెల్లడించారు. రీమేక్‌ చేయనని విజయ్‌ ఆఫర్‌ని తిరస్కరించారని, విజయ్ తో సినిమా చేయాలని డైరెక్టర్స్ భావిస్తారు. కానీ అనిల్‌ రావిపూడి .. దళపతి ఆఫర్‌కి నో చెప్పాడని చెప్పి షాకిచ్చారు నటుడు వీటీవీ గణేష్‌.

అనంతరం డైరెక్టర్ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. దళపతి విజయ్‌తో చర్చలు జరిగాయని, ఆయన చాలా మంచి వ్యక్తి అని, కలిసి ఒక్కసారే అయినా.. ఆయన గొప్పతనం ఏంటో తనకు అర్థమయ్యిందని తెలిపారు. అయితే.. ఓ విషయం గురించి తమ మధ్య చర్చ జరిగిందనీ, అవన్నీ వేరే అని, సినిమా గురించి వాళ్లు అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు. అయితే .. ఆ సినిమా రీమేక్‌ అనే విషయాన్ని టీమ్‌ ప్రకటిస్తుందని, తాను చెప్పలేనని వెల్లడించారు అనిల్ రావిపూడి వీటివీ గణేష్‌కి అడ్డుపడుతూ వచ్చారు. కానీ, ఆ ప్రాజెక్ట్ విషయంలో ఏదో జరిగిందనే అనుమానాలను రేకెత్తించారు. ఈ విషయం వైరల్ అవుతుండటంతో దళపతి విజయ్‌ లాంటి సూపర్‌ స్టార్‌ సినిమా వదులుకుంటారా? అనే సందేహం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X