KGF Chapter 2: రిలీజ్ రోజున నేషనల్ హాలీడే.. ప్రధాని మోదీకి లేఖ

దేశ సినీ చరిత్రలో ఎవరూ ఊహించని విధంగా కేజీఎఫ్‌: చాఫ్టర్ 1 చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలువడం అందర్నీ షాక్ గురి చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న కేజీఎఫ్: ఛాప్టర్ 2‌పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై రోజు రోజుకు క్రేజ్ ఊహించని విధంగా పెరుగుతున్నది. ఈ క్రమంలో కేజీఎఫ్2 గురించి అభిమానులు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఈ వివారాల్లోకి వెళితే...

Recommended Video

Yash Fans Writes Pm Modi To Declare National Holiday On KGF 2 Release
భారీ అంచనాలతో కేజీఎఫ్2

భారీ అంచనాలతో కేజీఎఫ్2

కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న కేజీఎఫ్2 చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. అయితే కేజీఎఫ్1 చిత్రం ఎలాంటి అంచనాల లేకుండా రిలీజ్ కావడం, ఆ తర్వాత ఘన విజయం సాధించడంతో కేజీఎఫ్‌2పై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.

జూలై 16వ తేదీన కేజీఎఫ్ రిలీజ్

జూలై 16వ తేదీన కేజీఎఫ్ రిలీజ్

భారీ అంచనాలతో కేజీఎఫ్2 చిత్రం జూలై 16వ తేదీన రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో యష్ ఫ్యాన్స్ తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ సినిమా రిలీజ్ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని తమ లేఖలో కోరారు. ఈ లేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మోదీ జీ... జాతీయ సెలవు దినంగా ప్రకటించండి

మోదీ జీ... జాతీయ సెలవు దినంగా ప్రకటించండి

ప్రధాని మోదీకి రాసిన లేఖలో అభిమానులు పేర్కొన్న ప్రకారం.. హీరో యష్ నటించిన కేజీఫ్‌: చాఫ్టర్ 2 చిత్రం జూలై 16, 2021 రోజున రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా విడుదల రోజును నేషనల్ హాలీడేగా ప్రకటించాలి అని కోరారు.

ప్యాన్ ఇండియా మూవీగా కేజీఎఫ్2

ప్యాన్ ఇండియా మూవీగా కేజీఎఫ్2

కేజీఎఫ్2 చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల కానున్నది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ఆనంత్ నాగ్, నాగభరణ, ప్రకాశ్ రాజ్, మాళవికా అవినాష్, అచ్యుత్ కుమార్, అర్చన జాయిస్ కీలక పాత్రల్లో నటించారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, రవి బాస్రూర్ సంగీతం, భువన్ గౌడ్ సినిమాటోగ్రఫిని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X