హీరో చిరంజీవి సర్జా, హీరోయిన్ మేఘన నిశ్చితార్థం... (ఫోటోస్)
కన్నడ నటుడు చిరంజీవి సర్జా, నటి మేఘనా రాజ్ నిశ్చితార్థం ఆదివారం బెంగుళూరులో గ్రాండ్ గా జరిగింది.
కన్నడ నటుడు చిరంజీవి సర్జా, నటి మేఘనా రాజ్‌ల నిశ్చితార్థం బెంగళూరులో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి సర్జా బాబాయ్, ప్రముఖ నటుడు అర్జున్ సర్జాతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెద్దల అంగీకారంతో వివాహం దిశగా అడుగులు వేశారు. చిరంజీవి సర్జా 2009లో కన్నడలో వాయుపుత్ర సినిమా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించగా, నటి మేఘానా రాజ్ తెలుగుతో పాటు పలు సౌత్ సినిమాల్లో నటించింది. ఈ జంట గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు.

అలా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది
హీరోయిన్ మేఘనారాజ్, చిరంజీవి సర్జా కలిసి ‘ఆటగార' అనే కన్నడ సినిమాలో జంటగా నటించారు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త కాల క్రమంలో ప్రేమగా మారింది.

డిసెంబర్లో వివాహం
చిరంజీవి సర్జా, మేఘనా రాజ్ వివాహం డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత మేఘనా రాజ్ సినిమాలకు దూరం అయ్యే అవకాశం ఉంది.

కుటుంబంతో హాజరైన అర్జున్ సర్జా
తన అన్నయ్య కుమారుడి నిశ్చితార్థ వేడుకకు అర్జున్‌సర్జాతో పాటు ఆయన భార్య ఆశారాణి, పిల్లలు ఐశ్వర్య సర్జా, ధృవసర్జా, ఇతర కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు.

సీక్రెట్ రిలేషన్
చిరంజీవి సర్జా, మేఘనా రాజ్ సన్నిహితంగా మెలుగుతుండటంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని పుకార్లు షికార్లు చేశాయి. చాలా కాలం పాటు సీక్రెట్‌గా రిలేషన్ షిప్ కొనసాగించిన ఈ జంట... కొన్ని రోజుల ముందే ఈ ఇద్దరూ తాము ప్రేమలో ఉన్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











