twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్‌కు బాహుబలి లాంటి ప్యాకేజ్... పాలిటిక్స్ కోసం త్యాగం చేయలేదు..జీవిత రాజశేఖర్ ఆరోపణలు

    |

    సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై జీవితా రాజశేఖర్ దంపతులు భగ్గుమన్నారు. విజయవాడలో శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించిన వారు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం, పవన్ కల్యాణ్ రాజకీయాలపై తీవ్రంగా స్పందించారు. ప్రజల జీవితాలను బాగు చేయడానికి కాదు.. ప్యాకేజీలు అందుకోవాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారు అని రాజశేఖర్ దంపతులు ఆరోపించారు. వారు ఇంకా ఏమన్నారంటే..

     పవన్ కల్యాణ్‌ అంటే మాకు గౌరవం

    పవన్ కల్యాణ్‌ అంటే మాకు గౌరవం

    హీరోగా పవన్ కల్యాణ్ అంటే మాకు గౌరవం ఉంది. పవన్ కల్యాణ్ టీడీపీ ప్యాకేజీలకు అమ్ముడుపోయారు. టీడీపీకి ఓట్లు వేయించి ఆ పార్టీని గెలిపించడమే ఆయన లక్ష్యం. పవన్ కల్యాణ్‌కు ఓటు వేసి తమ ఓటును వృథా చేసుకోవద్దు అని జీవితా రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఎన్టీఆర్, ఎంజీఆర్ మాదిరిగా రాజకీయాల్లోకి

    ఎన్టీఆర్, ఎంజీఆర్ మాదిరిగా రాజకీయాల్లోకి

    ముఖ్యమంత్రి కావాలని పవన్ కల్యాణ్‌కు బలమైన కోరిక ఉంది. అలా ఉండటంలో తప్పు లేదు. సీఎం కావాలంటే సినీ పరిశ్రమ నుంచి బయటకు వచ్చి ఎన్టీఆర్, ఎంజీఆర్ మాదిరిగా పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలి. అంతేకానీ పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించారు అని జీవితా రాజశేఖర్ అన్నారు.

     బాహుబలి ప్యాకేజ్ కోసమే పవన్

    బాహుబలి ప్యాకేజ్ కోసమే పవన్

    పవన్ కల్యాణ్‌కు స్థిరమైన వైఖరి లేదు. రాజకీయాలు చేస్తూ ప్రజల జీవితాలతో అడుకోవడం సరికాదు. బాహుబలి కంటే పెద్ద ప్యాకేజీ కోసమే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. మాట మాట్లాడితే తాట తీస్తాను. అంటున్నారు. తాట తీయడానికి రాజకీయాలు తాటికాయాలా? కొబ్బరికాయాలా అని జీవితా రాజశేఖర్ ఎద్దేవా చేశారు.

    సినిమాలపై మోజు తీరిన తర్వాతే పాలిటిక్స్‌లోకి

    సినిమాలపై మోజు తీరిన తర్వాతే పాలిటిక్స్‌లోకి

    పవన్ కల్యాణ్ మాదిరిగా నాకు పదవులను అనుభవించాలనే కోరిక ఉంది. కానీ సినిమాలపై మోజు తీరిన తర్వాత, సినిమాల్లో నటనపై పూర్తి సంతృప్తి చెందిన తర్వాత నేను రాజకీయాల్లోకి వస్తాను. పవన్ కల్యాణ్ మాదిరిగా పార్ట్ టైమ్ రాజకీయాలు చేయను. అంతేకానీ ప్యాకేజీల కోసం నేను రాజకీయాల్లోకి రాను అని రాజశేఖర్ అన్నారు.

    పవన్ కల్యాణ్ త్యాగం చేయలేదు

    పవన్ కల్యాణ్ త్యాగం చేయలేదు

    పవన్ కల్యాణ్ కోట్లు రూపాయల ఆదాయాన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చారనేది తప్పు. కేవలం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికి, ఆ పార్టీని గెలిపించడానికి మాత్రమే పార్టీ పెట్టారు. రానున్న రోజుల్లో ఇది రుజువు అవుతుంది అని రాజశేఖర్ అన్నారు.

    సినీ నటులను బెదిరించడం లేదని

    సినీ నటులను బెదిరించడం లేదని

    సినీ నటులను తెలంగాణ ప్రభుత్వం బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి పంపుతున్నారు అని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. మా కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వెంకటేష్, నాగార్జునను ఎందుకు కేసీఆర్ బెదిరించడం లేదు. వారిని ఎందుకు జగన్ పార్టీలోకి పంపడం లేదు. మమ్మల్నే కేసీఆర్ బెదిరించారా? అని రాజశేఖర్ అన్నారు.

    English summary
    Actors Jeevitha Rajasekhar criticises Pawan Kalyan. They alleges that, He has entered into politics for the sake of Baahubali Package only. By Jana sena Party, He is cheating the people. He has only desire to cash the politics
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X