మతం మార్చుకున్న సినీ తారలు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: ఒక మతాన్ని ఆచరిస్తున్న వారు...ఇతర మతాల వైపు ఆకర్షితులు కావడం, మత మార్పిడి చేసుకోవడం ఈ మధ్య కాలంలో సర్వ సాధారణంగా జరుగుతున్న వ్యవహారమే. కారణాలేమైనా కావచ్చు....ఎవరి ఇష్టం వారిది. మతం మార్చుకునే హక్కు, స్వేచ్చ ప్రతి ఒక్కరికి ఉంది.
మతం మార్చుకుంటున్న వారిలో సినిమా తారలు కూడా ఉంటున్నారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని సినిమా రంగాల్లోనూ మతం మార్పిడి చేసుకుంటున్న ప్రముఖులు ఉంటున్నారు. ఇప్పటి వరకు మతం మార్చుకున్న....పలువురు సౌత్ ఇండియా సినిమా తారల గురించి తెలుసుకుందాం....

క్రైస్తవ మతం స్వీకరించిన నగ్మ
మస్లిం మదర్, హిందూ ఫాదర్‌కు జన్మించిన నగ్మ......క్రైస్తవ మతం వైపు ఆకర్షితురాలైంది. 2007లో క్రైస్తవ మతం స్వీకరించింది.

ఏఆర్ రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహహాన్ హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారారు. ఆయన అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్. చిన్న వయసులోనే (1989) ఆయన మతం మారారు. ఆ తర్వాత తన పేరును అల్లా రఖా రహమాన్‌గా మార్చుకున్నారు.

నయనతార
కస్తవ మతానికి చెందిన దంపతులకు జన్మించిన నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. సినిమాల్లోకి వచ్చాక తన పేరును నయనతారగా మార్చుకున్నారు. ప్రభుదేవాను ప్రేమించిన ఆమె అతన్ని పెళ్లి చేసుకోవడం కోసం హిందూ మతం స్వీకరించారు. అయితే అనుకోకుండా పెళ్లికి ముందే ఇద్దరూ విడిపోయారు.

యువన్ శంకర్ రాజా
సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఇటీవలే ఇటీవలే ఇస్లాం మంతం స్వీకరించారు.

మోనికా
తమిళ నటి మోనికా ఇటీవలే హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారారు. మతం మార్చుకున్న తర్వాత ఆమె పేరును ఎంజి రహీమాగా మార్చుకున్నారు.

ఖుష్బూ
ముస్లిం కుటుంబంలో జన్మించిన నటి కుష్బూ తమిళ దర్శకుడు సుందర్ సిని వివాహం చేసుకున్నారు. ఎవరి ప్రమేయం లేకుండా తన ఇష్టప్రకారం హిందూ మతం స్వీకరించారు.


Click it and Unblock the Notifications











