Anasuya Bhardwaj: అనసూయలో ఈ మార్పులు ఏందబ్బా..అస్సలు ఊహించని విధంగా..ఈ సారి ఏం చేసిందంటే?
యాంకర్ అనసూయ భరద్వాజ్... జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక తన మాటలు, నవ్వులు, పొట్టి బట్టల్లో హాట్ షోతో ప్రేక్షకులను కనువిందు చేసే ఈ భామ... ఇటీవల సినిమాలు చేస్తూ.. మరింత పాపులర్ అయింది.
అయితే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే అనసూయ... ఈ మధ్య ఎందుకో మారిపోయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన అనసూయ... వేసుకునే బట్టల్లో కూడా ఈ మధ్య మార్పు వచ్చింది. ఇక ఈ సారి అనసూయ చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు. అదేంటో తెలుసుకుందాం.

యాంకర్ కంటే ముందు: తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ గా అనసూయ భరద్వాజ్ మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే అనసూయ యాంకర్ గా మారకముందు కొన్ని సినిమాల్లో నటించింది. కానీ చేసినవి చిత్రపాత్రలు కాబట్టి జనాలు ఎక్కువగా గుర్తు పట్టలేదు. ఎన్టీఆర్ నాగ చిత్రంలో కూడా అనసూయ ఓ చిత్ర పాత్రలో కనిపించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో మెరిసి... మూవీస్ కు బ్రేక్ ఇచ్చింది.

ప్రోగ్రామ్స్ ద్వారా: ఇక ఆ తర్వాత అనసూయ యాంకర్ గా న్యూస్ ఛానెల్స్ లో చేరింది. కొంత కాలం పాటు న్యూస్ ఛానెళ్లలో చేసిన అనసూయ.. ఆ తర్వాత ఎంటర్టైన్ మెంట్ ఛానెళ్ల బాట పట్టింది. ముఖ్యంగా జబర్ధస్త్ ప్రోగ్రామ్ ద్వారా.. ఆమెకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది. ఈ షోలో అద్భుతంగా యాంకరింగ్ చేసి అందరి దృష్టిలో పడింది. ఇక అనసూయ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.

అలా రీ ఎంట్రీ: ఇక ఇలా షోలు చేస్తూనే.. సినిమాల వైపు మళ్లీంది. నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించిన సోగ్గాడే చిన్ని నాయనతో సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె చిన్న పాత్రతో పాటు.. ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఇక ఆ తర్వాత ఆమెకు వరుసగా సినిమా ఛాన్స్ లు వచ్చాయి. 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప', 'దర్జా' సహా ఎన్నో సినిమాలతో పాటు ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది.

వెకెషన్ లో ఫ్యామిలీతో: ఇటీవల రంగమార్తాండ, విమానం సినిమాల్లోని అనసూయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ప్రస్తుతం అనసూయ వెకెషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ.. నెటిజన్స్ ను అలరిస్తుంది. ఇటీవల వివాదాలకు దూరంగా మారిన అనసూయ... డ్రెస్సుల విషయంలోనూ మార్పు వచ్చింది. పద్ధతైన డ్రెస్సులు వేసుకుంటూ.. ఒక్కసారిగా నెటిజన్స్ కు షాక్ ఇస్తోంది.

షాక్ ఇచ్చిన అనసూయ: ఇక తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ ఫోటోను షేర్ చేసింది. గుడ్ ఫుడ్ ఇజ్ ఏ గుడ్ మూడ్ అంటూ... ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో చిన్నారులు.. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. వారి కోసం మంచి ఆరోగ్య ఆహారాన్ని అనసూయ తయారు చేసింది.
బ్రెడ్, డ్రై ఫ్రూట్స్, అరటిపండ్లతో పాటు పలు రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. దీనికి థ్యాంక్స్ ఐ మెడ్ ఇట్ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే ఇది చూసిన నెటిజన్స్... అనసూయలో ఇంత మార్పు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రస్తుతం అనసూయ భరద్వాజ్.. అరి, పుష్ప 2 సినిమాలతో అలరించేందుకు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











