Anasuya Bhardwaj: అందాలు ఆరబోసి బోర్ కొట్టిందా ఏంటి.. అనసూయ ఇలా షాకిచ్చింది!
అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో సందడి చేస్తూ మరింత చేరువైంది. ఇక వరుస సినిమాల్లో కనిపిస్తూ... జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ... తాజాగా మరోసారి తన ఫోటోస్ ను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అవి చూసిన నెటిజన్లు అందమే అసూయ పడేలా అనసూయ అందంగా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....
పలు వివాదాల్లో....:బుల్లితెరపై యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం నటిగా బిజీ అయిన సంగతి తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకులకు దూరమై... వెండితెర, సోషల్ మీడియాలో అనసూయ దర్శనం ఇస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ... కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంది. ఆ మధ్య ఆంటీ అని పిలవొద్దు అని చెప్పగా... నెటిజన్స్ ఇంకా ట్రోల్స్ చేశారు.

విజయ్ ఫ్యాన్స్ తో వార్...:కొన్నాళ్ల క్రితం విజయ్ దేవరకొండ అభిమానులతో కూడా అనసూయకు ఇబ్బందులు తప్పలేదు. అనసూయ ఏదో కామెంట్ చేయడం.. దానికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. కౌంటర్ ఇవ్వడం ఇలా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక ఎందుకు గొడవ అనుకుందో ఏమో గానీ... ఇప్పుడు అనసూయ భరద్వాజ్ కొంత గతంలో కంటే సైలెన్స్ పాటిస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాపై పొగడ్తల వర్షం కూడా కురిపించింది.

అందాల ప్రదర్శన...:ఆ సంగతి పక్కన పెడితే ఈ భామ వయసును దాచుకునేందుకు తెగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ... అందాల విందును ప్రదర్శిస్తోంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది అనసూయ. అందాలు ఆరబోసి బోర్ కొట్టిందో ఏమే.. ఈ మధ్య పద్దతైన డ్రెస్సుల్లో కనిపిస్తూ.. తన అందాలను ప్రదర్శిస్తోంది. మొన్న మంచి డిజైనర్ డ్రెస్సులో దర్శనం ఇవ్వగా.. తాజాగా శారీలో దర్శనం ఇచ్చింది.

నెట్టింట వైరల్:ఇక ఈ శారీలో అనసూయ అందం రెట్టింపు అయిందనే చెప్పాలి. ఆ ఫోటోలు షేర్ చేస్తూ... గందరగోళంలో ప్రశాంతత కోసం వెతుకుతున్నట్లు ఓ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నీ అందం ఓ ఆకాశం.. చూసే కొద్ది ఇంకా ఇంకా కావాలి అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇక ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం అనసూయ.. తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సుకూమార్ దర్శకత్వంలో పుష్ప2 సినిమాలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











