Anasuya Bhardwaj Video: నాలో ఆ మార్పులొచ్చాయ్.. ఇకపై అలా ఉండలేను.. అనసూయ షాకింగ్ వీడియో పోస్ట్
టీవీ యాంకర్ నటి అనసూయలో ఈ మధ్య చాలా మార్పులు గమనిస్తున్నాం. ఉండే విధానానం, మాట్లాడే విధానం అంతా మారింది. అంతకుముందు చీటికి మాటికి ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకునే అనసూయ ఈ మధ్యలో కాస్త సైలెంట్ గానే ఉంటుంది. అయితే తాజాగా దీనిపై ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ. వివరాళ్లోకి వెళితే..
సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత..: 'జబర్దస్త్' షోతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న భామ అనసూయ. యాక్టింగ్ అండ్ యాంకరింగ్ స్కిల్స్‌తో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. కెరీర్ ప్రారంభంలో టెలివిజన్ రంగానికే పరిమితం అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాల్లో విలక్షణ నటిగా ఎదిగింది. అక్కడ మంచి పేరు రావడం వల్ల ఇక స్మాల్ స్క్రీన్ కు దూరంగా ఉంటూ మూవీస్ కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తోంది. అలా ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది.

వరుస సినిమాలతో...: సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్న అనసూయ.. ఈ ఏడాది 'మైఖేల్', 'రంగమార్తాండ', 'విమానం' వంటి చిత్రాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే, ఇప్పుడు వరుసగా 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', సహా పలు చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటే సౌత్ ఇండస్ట్రీలోని వేరే భాషల చిత్రాల్లోనూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తోంది.
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా..:
సోషల్ మీడియాలోనూ అనసూయ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎక్కవుగా ట్రోల్స్ కు గురౌతూ ఉంటుంది. కాంట్రవర్సీ వ్యాఖ్యలతో, ట్వీట్లతో ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా హీరో విజయ్ దేవరకొండ గురించి కాంట్రవర్సీ కామెంట్స్ చేసేంది. దీంతో అతడి అభిమానులు ఆమెను మరింత ఎక్కువగా ట్రోల్ చేసేవారు.

ఫ్యామిలీతో ఎక్కువగా.. కాంట్రవర్సీకీ దూరంగా..: గతంలో వరుసగా సినిమాలు, షోస్ అంటూ తీరిక లేకుండా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అలా లేదు. కాంట్రవర్సీకి కూడా దూరంగా ఉంటోంది. విజయ్ దేవరకొండతో వివాదాన్ని ముగించింది. అలాగే అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పింది. అంతేకాదు ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తుంది. ఈ క్రమంలోనే తరచుగా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ట్రిప్‌లకు కూడా వెళ్తోంది. అక్కడ ఫ్యామిలీతో కలిసి సందర్భాలను ఫొటోలు, వీడియోల్లో బంధించి వాటిని అభిమానులతో పంచుకుంటోంది.

అయితే ఇదంతా చూసిన నెటిజన్లు, ఆమె అభిమానులు అనసూయకు ఏమైంది? అసలు ఎందుకీ సడెన్ ఛేంజెస్, ఈ మార్పులకు కారణం ఏమిటి? అని తెగ మాట్లాడేసుకుంటాన్నారు. ఈ క్రమంలోనే అనసూయ తాజాగా మరో కొత్త వీడియోను పోస్ట్ చేసింది. అందులో తనలో వచ్చిన మార్పులను గురించి వివరించింది. 'మైండ్ సెట్ మారిపోయింది. నా ప్రాధాన్యతలు మారాయి. నా అభిరుచులు మారాయి. నా సహనం పెరిగింది..' అంటూ తన మార్పులు గురించి వివరించింది. ఈ వీడియో కూడా వెకేషన్ ట్రిప్ లో షూట్ చేసిందే.


Click it and Unblock the Notifications











