Anasuya Bhardwaj: మారిపోయిన అనసూయ... ఇలా షాక్ ఇచ్చింది ఏంటి భయ్యా?

బుల్లితెరపై తన అందం, అభినయంతో అలరించిన అనసూయ.. ఈ మధ్య వెండితెరపై కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇక ప్రస్తుతం అనసూయ చేతిలో ఆఫర్స్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అను.. తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ... అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది ఈ భామ. ఆ వివరాల్లోకి వెళితే...

యాంకర్ టు నటి...:యాంకర్ గా బుల్లితెరపై అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అనసూయ భరద్వాజ్. జబర్దస్ షో ద్వారా బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త పాత్రతో ఒక్కసారిగా అనసూయలో ఇంత టాలెంట్ ఉందా అని షాక్ అయ్యారు. ఇక ఆ సినిమా తర్వాత ఆమెకు వెండితెరపై సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి.

Actrees Anasuya Bharadwaj Posted A With Her Family photos and looking georgeous viral in social media

చేతి నిండా ప్రాజెక్ట్స్... :ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో దాక్షయనిగా కనిపించి.. అలరించింది. ఇక ఈ ఏడాది విమానం సినిమాలోనూ వేశ్యగా కనిపించింది అనసూయ. ఈ పాత్ర ఆమెకు మరింత గుర్తింపు తీసుకువచ్చింది. ప్రస్తుతం సుకూమార్ దర్శకత్వంలోనే.. పుష్ప 2 చిత్రంలో అనసూయ నటిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు ఆమె చేతి నిండా పలు ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం.

ఎంజాయ్ ది ట్రిప్... :ఇక ఖాళీ సమయం దొరికితే చాలు అనసూయ.. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో టూర్ ఎంజాయ్ చేస్తోంది. యూఎస్ లో పర్యటిస్తున్న అనసూయ.. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ , ఘిరాడెల్లి స్క్వేర్ వద్ద తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. కుటుంబంతో ఎక్కువ సమయం కలిసి ఉండటం ఉత్తమం అనే అర్థం వచ్చేలా కామెంట్ కూడా పెట్టింది. ఈ ఫోటోలు చూసిన అనసూయ అభిమానులు... ఎంజాయ్ ది ట్రిప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Actrees Anasuya Bharadwaj Posted A With Her Family photos and looking georgeous viral in social media

రొమాంటిక్ పోజులు.. :ఇక అనసూయ అందాల ఆరబోతకు హద్దే ఉండదు. గతంలో తను థాయిలాండ్ వెకేషన్ కి వెళ్ళినప్పుడు పెట్టిన బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్స్ బోల్డ్ కామెంట్స్ కూడా చేశారు. పలు విమర్శలు కూడా చేయగా.. అనసూయ సీరియస్ కూడా అయింది. ఇప్పుడు ఏమైందో ఏమో... ఇప్పుడు షేర్ చేసిన ఫోటోల్లో అనసూయ పద్దతిగా కనిపిస్తుంది. ఎలాంటి అందాల ఆరబోత లేకుండా.. భర్తతో కలిసి రొమాంటిక్ స్టైల్ పోజులు ఇచ్చింది

నెటిజన్స్ షాక్.. :అనసూయలో ఈ మార్పు చూసి నెటిజన్స్ షాక్ అవుతారు. అనసూయ ఏంటి ఇలా మారిపోయిందని అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య వివాదాల జోలికి అనసూయ పోవడం లేదు. ఆంటీ వివాదం, ది విజయ్ దేవరకొండ వంటి వివాదాలకు పుల్ స్టాప్ పెట్టి.. తన పని తాను చేసుకుంటుంది. అటు సోషల్ మీడియాలోనూ హద్దు మీరకుండా ఫోటోలకు పోజులు ఇస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X