Anasuya Bharadwaj Video: ఆ వీడియో షేర్ చేసి.. హేటర్స్ నోరు మూయించిన అనసూయ

యాంకర్‌ అనసూయ ఈ మధ్య బుల్లితెరకు దూరమైందేమో కానీ... సోషల్ మీడియా ద్వారా మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో ద్వారా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వచ్చే ఈ భామ తాజాగా చేసిన ఒక వీడియో మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. ఆమె వారందరికీ కౌంటర్లు ఇస్తోందంటూ.. కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

ఒకప్పుడు న్యూస్ ప్రెసెంటర్ గా జీవితం మొదలుపెట్టిన అనసూయ తర్వాతే ఎంటర్టైన్మెంట్ వైపు మొగ్గుచూపింది. అలా జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా ఆమె మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఒక రకంగా యాంకర్‌ అనసూయ.. కామెడీ షోని వదిలేసి సినిమాలతో బిజీగా ఉంటుంది. అయితే ఖాళీ టైమ్ ఎక్కువగా దొరుకుతున్న నేపథ్యంలో ఆమె సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండి సోషల్ మీడియాలో తన అభిమానులతో పాటు హేటర్లతో కూడా చర్చలు జరుపుతోంది.

Anasuya Bharadwaj Video

ఎక్కువగా తన హాట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండే అనసూయ... సోషల్‌ మీడియాలో వివాదాలకు కూడా కేరాఫ్‌గా నిలుస్తుంది. తనని అభిమానించే వారి కోసం హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేసే ఆమె తనను చేసి హేట్‌ చేసే వాళ్లని కౌంటర్లిస్తూ రచ్చ చేస్తుంది. అదే సమయంలో విచిత్రమైన పోస్ట్ లతోనూ ఆమె మళ్లీ మళ్లీ ట్రోల్స్ కి గురవుతుంది.

పాజిటివ్‌గా అయినా, నెగటివ్‌గా అయినా తను వార్తల్లో ఉండేలా చూసుకుంటున్న అనసూయ.. మీడియా నాడి పట్టేసినట్టే కనిపిస్తోంది. ఏమాత్రం గ్యాప్‌ వచ్చినా, ఏదో రూపంలో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మళ్ళీ వార్తల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తూనే కనిపిస్తోంది. తాజాగా తన మీద ట్రోల్స్ చేసే వారందరినీ రెచ్చగొట్టేలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది అనసూయ భరద్వాజ్.

Anasuya Bharadwaj Video

ఇందులో అనసూయ, ద్వేషించే వారందరికీ ఒక సందేశం అంటూ, నేను చేసే పని మీకు నచ్చకపోవచ్చు, కానీ నేను చేసేదంతా మీరు చూస్తున్నారు కాబట్టి ఇప్పటికీ మీరు నా అభిమానినే అంటూ పోస్ట్ పెట్టింది. ఈ కామెంట్ల మీద రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి కొంతమంది ఆమె పెట్టిన పోస్ట్ నిజమే కదా అని ఆమెకు మద్దతు తెలుపుతుంటే మరికొంతమంది మాత్రం ఏ పని లేక ఇలాంటి పోస్టులు పెడుతూ కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Anasuya Bharadwaj Video

సుకుమార్ పుణ్యమా అని రంగస్థలం, పుష్ప సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆమె ఇప్పుడు పూర్తిగా తెలుగు టీవీ షోస్ మానేసి సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె పుష్ప 2 సినిమాతో పాటు పెద్దకాపు, సింబ, ప్రేమ విమానం, వుల్ఫ్ లాంటి సినిమాలలో కనిపించబోతోంది. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం అనసూయ భరద్వాజ్ పెట్టిన పోస్ట్ మీరు కూడా చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X