»   » వ్యభిచారం రాకెట్లో పట్టుబడ్డ మరో సినీ నటి

వ్యభిచారం రాకెట్లో పట్టుబడ్డ మరో సినీ నటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

జోధ్‌పూర్: ఎన్నో ఆశలతో రంగుల సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టి...ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంతోనో, డబ్బు సంపాదించాలనే అత్యాశతోనే కొందరు నటీమణులు వ్యభిచారంలోకి దిగి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో నటి వ్యభిచార రాకెట్లో పట్టుబడింది. ఆమె ఎవరో కాదు తమిళ నటి ఐష్ అన్సారీ.

జోధ్‌పూర్‌లోని రైకాబాగ్ రోడ్లో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్‌ తఖ్త్ విలాస్‌లో ఐష్ అన్సారీతో పాటు వ్యభిచార రాకెట్లో ఆమె భాగస్వాములుగా ఉన్న వారిని పోలీసులు అరెస్టు చేసారు. ఆమె కొందరితో కలిసి హై ఫ్రొఫైల్ సెక్స్ రాకెట్ నడుపుతోందని, హై ప్రొఫైల్ కస్టమర్లకు ఫారిన్ మోడళ్లను కూడా సప్లై చేస్తుందని తెలుస్తోంది.

Aish Ansari

పోలీసులు వారి వద్ద నుంచి రూ. 2 లక్షల నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వీధీనం చేసుకున్నారు. ఇంటర్నెట్ ద్వారా వారు కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు పథకం ప్రకారం రైడ్ చేసి వారిని రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నట్లు ఎడిసిపి కేసర్ సింగ్ తెలిపారు.

ఐష్ అన్సారీ పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది. షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'ఓం శాంతి ఓం' చిత్రంతో పాటు, మరో బాలీవుడ్ చిత్రం చల్తే చల్తే చిత్రంలో నటించింది. దీంతో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించింది. గతంలో బూమ్ బూమ్ అనే మ్యూజిక్ ఆల్బమ్ చిత్రీకరణ సందర్భంగా ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కూడా ఫోటోలు దిగింది.

English summary
In yet another case of flesh trade in show business, a Tamil movie actress and her accomplice were caught red-handed at a five star hotel in Jodhpur. Aish Ansari was among four people held in connection with a flesh trade racket at Raikabagh Road, a police official said today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu