వైఎస్ జగన్‌తో నటి ఫోటో వైరల్.. నిజంగా పవన్ అభిమానులైతే, నేను వీరాభిమానిని!
Recommended Video

కొన్ని రోజులుగా వైఎస్ జగన్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఈ ట్రోలింగ్ మొదలైంది. ఈ గొడవలో నటి అలేఖ్య ఎంజల్ ఇబ్బందికర పరిస్థితులని ఎదుర్కొన్నారు. నటి అలేఖ్య స్విస్ రాజా, మిస్టర్ మనీ వంటి చిన్న చిత్రాల్లో నటించారు. ఇంతకీ అసలు వివాదం ఏంటో ఇప్పుడు చూద్దాం..

జగన్ తో సెల్ఫీ
నటి అలేఖ్య ఏంజెల్ జగన్ తో దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోతో పవన్ ఫాన్స్ జగన్ ని ట్రోల్ చేస్తున్నారు. ఈ వార్త గురించి నటి అలేఖ్య విని ఆవేదన వ్యక్తం చేసారు.

బాధించే అసత్యాలు
తాను జగన్ తో దిగిన సెల్ఫీ గురించి ప్రచారం జరుగుతున్న అసత్యాలు నా దృష్టికి వచ్చాయి. అవి నన్ను తీవ్రంగా బాధించాయి. ఈ చర్యలని తీవ్రంగా ఖండించడానికే స్పందిస్తున్నాను అంటూ అలేఖ్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ఆడియో సీడీ కార్యక్రమం
2017 లో తన ఫ్యామిలీ, మ్యూజిక్ టీం తో కలసి జగన్ ని లోటస్ పాండ్ లో కలిసాను. ఓ ఆడియో సిడి లాంచ్ చేయడానికి జగన్ ని కలిసాం. సిడి లాంచ్ జరిగిన తరువాత జగన్ తో సెల్ఫీ తీసుకున్నా అని నటి అలేఖ్య తెలిపారు.

మీ గొడవలో
మీరంతా జగన్ ని టార్గెట్ చేసే సమయంలో తాను బలవుతున్నానని నటి అలేఖ్య ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన తన గౌరవానికి భంగం కలుగుతోందని ఆమె అన్నారు. ఇదే మన ఇంటి ఆడవాళ్లకు జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉంటుందని పవన్ ఫాన్స్ ని ఆమె ప్రశ్నించారు.
పవన్ కు వీరాభిమానిని
నేను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని. అతని మానవత్వ విలువలు నాకు ఆదర్శం. దయచేసి నాకు సంబందించిన ఫొటోలన్నింటిని సోషల్ మీడియా నుంచి తొలగించండి అని అలేఖ్య కోరారు.

ఇల్లేమో దూరం
ఇల్లేమో దూరం.. అసలే చీకటి ఘాఢాంధకారం.. చేతిలో దీపం లేదు.. కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. తాను ఎప్పుడైనా నిరాశలో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలనే గుర్తు చేసుకుంటా అని అలేఖ్య తెలిపారు. మీరు ట్రోల్ చేస్తున్నా ధైర్యంగా ఉండగలుగుతున్నానంటే కారణం ఆ మాటలే అని అలేఖ్య తెలిపారు.

పవనే స్వయంగా
ఈ వివాదం విషయంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించానని, వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లవద్దని సూచించారు.


Click it and Unblock the Notifications











