Anasuya Bharadwaj: అరేయ్ ఏంట్రా మీరంతా... అనసూయనే కాదు.. ఏడుపునూ అర్థం చేసుకోలేరా?
యాంకర్ అనసూయ... ఈరోజు ఒక్కసారిగా అభిమానులకు ఏడుస్తూ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెక్కివెక్కి ఏడుస్తూ ఈరోజు వీడియో షేర్ చేస్తూ దానికి సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేసింది. ఇక ఆ వీడియో వైరల్ కాగా మరొక వీడియోను రిలీజ్ చేసింది అనసూయ. అసలు తాను ఎందుకు ఏడ్చిందో చెప్పుకొచ్చింది. మీరంతా తప్పుగా అర్థం చేసుకున్నారంటూ... వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే....
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే భామ అనసూయ భరద్వాజ్ సడన్ గా ఏడుస్తూ వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అన్ని వెబ్ సైట్స్, న్యూస్ ఛానెల్స్ ఆ వీడియోను ప్రెజెంట్ చేస్తూ వార్తలు వస్తున్నాయి. వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ, గుక్క పెట్టి ఏడ్చిన అనసూయ, అనసూయకి ఏం కష్టం వచ్చింది, అనసూయ ఏంటి ఇలా చేసింది, అనసూయ అంతలా ఎందుకు ఏడుస్తుంది.. అంటూ కథనాలు వెలువడ్డాయి.

అంతేకాదు కొన్నాళ్ల క్రితం హీరో విజయ్ దేవరకొండ అభిమానులతో వివాదం పెట్టుకొని వారికి టార్గెట్ గా మారిన అనసూయ అదే విషయాన్ని బాధపడుతూ... ఇప్పుడు వీడియోలో పోస్ట్ చేసిందంటూ అందరూ భావించారు. చాలా మంది సోషల్ మీడియాలో నెగిటివిటీ భరించలేక అనసూయ ఏడుస్తుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే ఈ వీడియోపై అనసూయ స్పందించింది. మీరంతా అర్థం చేసుకున్నది.. వేరని... నేను రాసింది సరిగ్గా చదవలేదని మరో వీడియో రిలీజ్ చేసింది. తాను ఏడ్చే వీడియోని షేర్ చేసి సెలూన్ కి వెళ్ళొచ్చే లోపే ఇంత జరిగిందని చెబుతూ మరో వీడియోను రిలీజ్ చేసింది. ఇక ఆ వీడియోలో ''అరేయ్ ఏంట్రా మీరంతా కొన్ని సందర్భాల్లో ఏడవవలసి వస్తుంది.. అయితే నేను ఏడిస్తే ఎవరేమనుకుంటారో అని ఉండిపోకుండా మనసారా ఏడ్చేసి రెస్ట్ తీసుకుంటా ఆ తర్వాత పని మొదలు పెడతా అనే ఉద్దేశంతో వీడియో షేర్ చేశాను... అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

అయితే దాన్ని తప్పుగా అర్థం చేసుకొని సోషల్ మీడియాలో నెగిటివిటీ వల్ల తాను ఏడుస్తూ వీడియో పెట్టానని అనుకుంటున్నారని వెల్లడించింది. ఇది కరెక్ట్ కాదని ఆమె చెప్పుకు వచ్చింది. సోషల్ మీడియా నెగిటివిటీ వల్ల తాను బాధపడటం నిజమేనన్న అనసూయ... ఆ విషయంలో అయితే వారికి ఎదురు వెళ్లి పోరాడుతాం తప్ప ఇలా ఏడ్చే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చింది.

ఇక అనసూయ ఇలా వీడియోలు పెట్టడం హాట్ టాపిక్ గా మరింది. ఇక అనసూయ ఇటీవల విమానం అనే సినిమాలో వేశ్యగా నటించి మెప్పించింది. ప్రస్తుతం అనసూయ చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె ప్రభుదేవాతో కలిసి వుల్ఫ్ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్ ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











