Anasuya Bhardwaj: అవే నా ఫేవరెట్.. అలా ఉండటం హ్యాపీ: అనసూయ వీడియో వైరల్
యాంకర్ కమ్ నటి అనసూయ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఆమె ఏడుస్తూ వీడియోలు పోస్ట్ చేయడం.. ఆ తర్వాత తన ఏడుపు ఎందుకో క్లారిటీ ఇస్తూ మరో వీడియో రిలీజ్ చేయడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వీడియో పోస్ట్ చేసింది అనసూయ. ఆమెకు అవి అంటేనే ఇష్టమంటూ... పోస్ట్ చేసింది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఒకప్పుడు ఎంటర్ టైన్మెంట్ ఛానెల్స్ లో యాంకర్ గా వచ్చే ఈమె... ఆ తర్వాత ఈటీవీలో జబర్ధస్త్ షోకి యాంకర్ గా మారి పాపులర్ అయింది. పొట్టి పొట్టి డ్రెస్సులో కుర్రాకారును టెంప్ట్ చేస్తూ... అటు సోషల్ మీడియాలోనూ హల్ చేసేది అనసూయ. కొంత కాలం జబర్ధస్త్ కు మహారాణిలా ఉండే ఈమెకు పోటీగా రష్మి దిగింది.

ఇక రష్మి, అనసూయ మధ్య అందాల పోటీగా అన్నట్లు షో సాగింది. ఒకరికి మంచి.. మరోకరు అందాలు ఆరబోస్తూ... రెచ్చిపోయేవారు. ఇక కామెడీ షోలో అందాల ఆరబోత.. ప్రేక్షకులకు మాత్రం ఎంటర్ టైనింగ్ లా ఉండేది. ఇక ఆ షోల తర్వాత ఈ భామకు సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక ఏమైందో ఇటీవల బుల్లితెరకు గుడ్ బై చెప్పి.. సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంది.
ఇక అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలో బిజిబిజిగా మారిపోయింది. ఇటీవల విమానం అనే సినిమాలో అనసూయ వేశ్యగా నటించి మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో ఇటీవల ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసి కలకలం రేపింది. మరో వీడియో రిలీజ్ చేసి.. తను ఎందుకు అలా ఏడ్చానో క్లారిటీ ఇచ్చింది. ఆ విషయం పక్కన పెడితే అనసూయ మరో వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది.

తాజాగా అనసూయ తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. నిత్యం సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు తన పెట్స్ తో ఫోటోలు వీడియోలు షేర్ చేయడంతో నెటిజన్స్ లైక్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఆ పోస్టు అనసూయ.... కుక్కలు నా ఫేవరెట్ వ్యక్తులు.. ఆ డాగ్ మామ్ లైఫ్ లో అత్యంత సంతోషంగా జీవించేది నేనే అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. సుకమార్ తెరకెక్కించే పుష్ప 2 సినిమాతో పాటు.. ప్రభుదేవా నటిస్తోన్న వుల్ఫ్ సినిమాలో కూడా అనసూయ కీలక పాత్ర చేస్తోంది. ఆ మధ్య పోస్టర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.


Click it and Unblock the Notifications











