కరోనా అంటూ ప్రచారం.. దండం పెడుతూ క్లారిటీ ఇచ్చిన అంజలి
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కరోనా తాండవం చేస్తోంది. మరీ ముఖ్యంగా వకీల్ సాబ్ యూనిట్‌ను కరోనా భయబ్రాంతులకు గురి చేసింది. వకీల్ సాబ్‌లో నటించిన నివేదా థామస్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంది. అయితే ఆ రెండు మూడు రోజుల తరువాతే నివేదా థామస్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో యూనిట్ మొత్తం షాక్ అయింది. అయితే సినిమా యూనిట్‌లోని మెంబర్స్‌కి కూడా కరోనా వచ్చి ఉంటుందని అంతా భావించారు.
ఇక నేటి ఉదయం నుంచి కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అంజలికి కూడా పాజిటివ్ అని నిర్దారణ అయిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. దీంతో వకీల్ సాబ్ గురించి అభిమానులు ఆందోళన చెందారు.అయితే ఈ వార్తలు, రూమర్లు చివరకు అంజలి చెవిలో పడ్డాయి. వాటిపై వెంటనే స్పందించి రూమర్లకు అడ్డు కట్ట వేసేసింది. ప్రస్తుతం అంజలి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. కరోనా పాజిటివ్ అంటూ వచ్చిన ఫేక్ వార్తలను అంజలి ఖండించింది.

ఈ మేరకు అంజలి చేసిన పోస్ట్‌లో.. నాకు కరోనా పరీక్షలో పాజిటివ్ రాలేదని ప్రకటిస్తున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది. ఈ విషయాన్ని నా శ్రేయోభిలాషులకు, ఫ్రెండ్స్, నా ప్రియమైన అభిమానులతో పంచుకోవడం సంతోషంగా ఉంది. కొన్ని వెబ్ సైట్స్ ఆర్టికల్స్‌లో నాకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ రాశారు. కానీ అవన్నీ తప్పుడు వార్తలే. అందులో ఏమాత్రం నిజంలేదు. నేను ఎంతో ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నాను. క్షేమంగానే ఉన్నాను.. మీరంతా సురక్షితంగా ఉండండి అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











