»   » ఆస్తి కోసం...కోర్టును ఆశ్రయించిన హీరోయిన్ అంజలి

ఆస్తి కోసం...కోర్టును ఆశ్రయించిన హీరోయిన్ అంజలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ నటి అంజలి తన పిన్ని భారతీదేవి, బాబాయి సూరిబాబుపై కేసు పెట్టింది. వారిద్దరూ తనను బెదిరిస్తున్నారని... రక్షణ కల్పించాలంటూ మద్రాసు కోర్టును ఆశ్రయించింది. వారి దగ్గరున్న తన ఆస్తులను తనకు ఇప్పించాలంటూ కోరింది. ఈ మేరకు అంజలి ఫిర్యాదును పరిశీలించిన కోర్టు వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

మరో వైపు అంజలిపై కూడా పలు కేసులు నడుస్తున్నాయి. తమిళ దర్శకుడు కళంజియ్ వేసిన పరువు నష్టం దావా కేసులో చెన్పైలోని సైదాపేట కోర్టు హీరోయిన్ అంజలికి కొన్ని రోజుల క్రితం సమన్లు జారీ చేసింది. ఈ రోజు ఆమె కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా డుమ్మా కొట్టింది. దీంతో ఆగ్రహించిన కోర్టు నవంబర్ 22లోగా తప్పకుండా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. గతంలో పలు పర్యాయాలు అంజలికి కోర్టు నోటీసులు అందజేసినా ఆమె హాజరు కాలేదు.

తమిళ దర్శకుడు కళంజియం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఆమె ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఇప్పటికే పలుసార్లు కోర్టుకు గైర్హాజరు అయ్యింది. గతంలో కోర్టు పలు మార్లు హెచ్చరికలు చేసినా, అరెస్టు వారెంట్లు జారీ చేసినా ఆమె తన తీరు మార్చుకోలేదు.

పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, తన ఆస్తులు వాడుకుంటున్నారని, మానసికంగా హింసిస్తున్నారని మీడియాతో సంచలన వ్యాఖ్యాలు చేసిన అంజలి ఆ తర్వాత అజ్ఞాతంలో వెళ్లి అందరినీ హైరానా పెట్టిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత అజ్ఞాతం వీడిన ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. కాగా....అంజలి తనపై ఆరోపణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు కళంజియం ఆమెపై పరువునష్టం దావా వేసారు. అంజలి తన సినిమాకు డేట్స్ ఇచ్చి హాజరు కావడం లేదని, ఆమె మూలంగా తమకు లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆయన అంటున్నారు. అంజలి తెలుగులో వెంకటేష్-రామ్ మల్టీ స్టారర్ 'మసాలా' చిత్రంలో వెంకటేష్ సరసన నటిస్తోంది.

English summary
Actress Anjali filed case against Bharathi Devi. She doesn't want to go back to her home because her uncle Suribabu and aunty Bharati Devi both have harassed her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu