twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్లైమాక్: పోలీస్ కమీషనర్‌ వద్దకు అంజలి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హీరోయిన్ అంజలి వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకుంది. అజ్ఞాతంలోకి వెళ్లి అందరినీ హైరానా పెట్టిన అంజలి త్వరలో పోలీస్ కమీషనర్‌ను కలిసి అన్ని విషయాలు వెల్లడించనుంది. ఆమెను కాంటాక్టు చేయగా ఈ విషయం వెల్లడించినట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది.

    హీరోయిన్ అంజలి తమకు ఫోన్ చేసిందని, క్షేమంగా ఉన్నానని చెప్పిందని, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని చెప్పిందని అంజలి అసలు తల్లి, సోదరుడు రవిశంకర్ బుధవారం ఉదయం మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. అంజలి కనిపించడం లేదని నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె కుటుంబ సభ్యులు ఈ రోజు దాన్ని వెనక్కి తీసుకోవడానికి రాగా.... అంజలి తమ ముందు హాజరయ్యాకే కేసు మూసి వేస్తామని పోలీసులు స్పష్టం చేసారు.

    కాగా... తనను వేధిస్తోందని అంజలి ఆరోపణలు చేసిన ఆమె పిన్ని భారతీ దేవి ఈ రోజు చెన్నై పోలీసులకు ఆమె అదృశ్యంపై ఫిర్యాదు చేసింది. డబ్బు కోసమే అంజలి వెనక ఉండి ఎవరో ఇదంతా చేయిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అంజలిని దత్తత తీసుకుని కన్న కూతురిలా పెంచానని, సినిమా హీరోయిన్‌ను చేసానని, కానీ అంజలి ఇప్పుడు తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతో బాధించిందని తెలిపింది.

    మరో వైపు అంజలి మిస్సయిన సమయంలో ఆమెతో పాటు హైదరాబాద్ దస్పల్లా హోటల్లో ఉన్న ఆమె బాబాయ్ సూరి బాబు మీడియాతో మాట్లాడుతూ.... తాను స్నానం చేసి వచ్చేలోగా అంజలి వెళ్లి పోయిందని, ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయాలు హోటల్ సిబ్బందిని ఆరా తీస్తే ఇండికా కారులో వెళ్లినట్లు చెప్పారని, అంజలి వెళ్లేప్పుడు వెంట హ్యాండ్ బ్యాగ్, సెల్ ఉన్నాయని తెలిపారు.

    కాగా... అంజలి ప్రస్తుతం బెంగుళూరులో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఉగాది పండగ తర్వాత ఆమె హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంజలి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మరో వైపు పోలీసులు అంజలి వ్యవహారం వెనక ఉన్న వాస్తవాలపై ఆరా తీస్తున్నారు.

    English summary
    Actress Anjali's sudden disappearance seems to be heading to a climax. she is going to approach the police commissioner soon and disclose her side of the story. Anjali has been in hiding since Monday (April 8). Her brother has not heard from her since then. Worried about her whereabouts, he registered a missing person's case on Tuesday. Police officers are investigating the matter. "I haven't spoken to her since Monday. She was in a hotel in Hyderabad on Monday, but she is not to be found there now. I worry about her whereabouts. Until I see her, I won't be relieved," Ravi Shankar told IANS.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X